35.2 C
Hyderabad
May 1, 2024 02: 27 AM
Slider ముఖ్యంశాలు

పినకిల్: శాస్త్ర పరిశోధనల్లో మేటి మన సీవీరామన్

ocion and sky

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

సామాన్యుడిగా పుట్టి అసామాన్యుడుగా మారడం మామూలు విషయం కాదు. అలా ఘనత సాధించిన వ్యక్తి సర్ సీవీ రామన్. ఆయన సాధించిన విజయాన్ని స్మరించుకోవడం భావితరాలకు స్ఫూర్తినిస్తుంది. అందుకే ప్రతి ఏటా మనం నేడు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఆయన పేరుతో నిర్వహించుకుంటున్నాం.

సీవీ రామన్ గా ప్రసిద్ధి చెందిన ఆయన పూర్తి పేరు చంద్రశేఖర్ వెంకట రామన్. తిరుచినాపల్లి సమీపంలో అయ్యన్ పెటాయ్ గ్రామంలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతీ అమ్మాళ్ దంపతులకు ఆయన జన్మించారు. రామన్ విశాఖపట్నం లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. భౌతిక శాస్త్రం అంటే విపరీతమైన అభిమానం ఉన్న ఆయన తన 12 వ ఏటనే మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు.

అంత చిన్న వయసులోనే మెట్రిక్ పూర్తీ చేయడం ఒక విశేషమైతే భౌతిక శాస్త్రం (ఫిజిక్స్) లో గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించారు. తరువాత ఎమ్ ఎస్ సి ఫిజిక్స్ లో యునివర్సిటీ టాపర్ గా నిలిచారు. తన 18 వ ఏట కాంతికి సంబంధించిన ధర్మాలపై రామన్ రాసిన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమైంది.

దీంతో ఆయనను లండన్ లో పరిశోధనలు చేయడానికి వెళ్లాలని ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. అయితే, అయన ఆరోగ్యం కారణాల వల్ల వెళ్లలేకపోయారు. ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ పాస్ అయ్యారు. కోల్ కతా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ గా ఆయన  చేరారు.

ఉద్యోగంలో చేరే ముందు లోకసుందరి అమ్మాళ్తో పెళ్ళయింది. ఒకసారి ఆయన కలకత్తాలో ప్రయాణం చేస్తున్నప్పుడు బౌబజారు స్ట్రీట్ దగ్గర ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూసి అక్కడికి వెళ్ళారు. ఆ సంస్థ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్ ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందారు. అలా అనుమతి పొందిన తరువాత పరిశోధనలపై ఉన్న ఆసక్తి తో ఆయన నిరంతర కృషి చేశారు.

ఎలాంటి వెసులుబాటు దొరికినా ఎక్కువగా పరిశోధనలతోనే గడిపాడు. తన జీవిత కాలంలో సగభాగం పరిశోధనలకే కేటాయించాడంటే ఆయనకు పరిశోధనలపై ఎంత ప్రేమ దాగి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన తల్లి పార్వతి అమ్మాళ్ కు సంగీతంలో మంచి అభిరుచి ఉండేది. ఆమె వీణను అద్భుతంగా వాయించే వారు. అందుకే రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం వంటి సంగీత వాయిద్యాల గురించి సాగాయి.

విజ్ఞాన పరిశోధనపై కోరిక తో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు. 1921 లో లండన్ లో తను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై ఉపన్యాసాలు ఇచ్చారు. రామన్‌ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్‌ ముఖర్జీ బ్రిటీష్‌ ప్రభుత్వానికి లేఖ రాస్తూ రామన్‌ సైన్స్‌ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుందని సూచించినా బ్రిటీష్‌ ప్రభుత్వం అంగీకరించలేదు.

దాంతో సీవీరామన్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి పరిశోధనలు కొనసాగించారు. శబ్దశాస్త్రం నుంచి కాంతి శాస్త్రం వైపు ఆయన పరిశోధనలు మారాయి. ఇదే ఆయన జీవితంలో కీలక మలుపు అవుతుందని ఆయన కూడా అనుకుని ఉండరు.

ఒక సారి ఆయన ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండింటికి నీలిరంగు ఉండటం ఆయనను ఆలోచింప చేసింది. అప్పటిదాకా అనుకుంటున్నట్లు సముద్రపు నీలి రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదు.

సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి వక్రీకరణ చెందడమే కారణం అని ఊహించాడు. అదే అయన పరిశోధనల్ని మేలిమలుపు తిప్పింది. ఆయన ఆనాడు వేసిన పునాదులే సముద్రం నీలిరంగులో ఎందుకుంటుంది. ఆకాశం కూడా నీలి రంగులోనే ఎందుకుంటుంది.

పగలు నక్షత్రాలు ఎందుకు కనపడవు. ఎన్నో ప్రశ్నలు,మరెన్నో ఆసక్తికర అంశాలు. వీటన్నింటికీ సమాధానం సీవీ రామన్ కనుగొన్న సూత్రాలే ప్రామాణికం అయ్యాయి. సైన్సు రంగంలో ఎవరూ చేయలేని సాహసాలను అత్యంత సునాయాసంగా ఛేదించి ప్రపంచ వినువీధిలో మన దేశ పతాకాన్ని రెపరెపలాడించిచన ఘనుడు సీవీరామన్.

ఆధునిక పరికరాలు లేకపోయినా రామన్ తన ఆలోచన తో ప్రయోగాలు చేశారు. అయన కష్టానికి 1928 ఫిబ్రవరి 28 న ఫలితం దక్కింది. ”పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది” అని కనిపెట్ట గలిగారు. ఇదే విషయాన్ని అయన 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో నిరూపించారు. అంతే ఆ పరిశోధన రామన్ ఎఫెక్ట్ గా చరిత్రలో నిలిచిపోయింది. అందుకే ఆ మహనీయుడిని నేడు మనం స్మరించుకుంటున్నాం.

Related posts

తైక్వాండో విజేతలను అభినందించిన ములుగు అడిషనల్ డిసిపి సాయి చైతన్య

Satyam NEWS

కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఏపి ఉన్నతాధికారులు

Satyam NEWS

26 న శ్రీశైలం కి రాష్ట్రపతి ముర్మూ రాక

Bhavani

Leave a Comment