38.2 C
Hyderabad
April 29, 2024 13: 38 PM
Slider వరంగల్

తైక్వాండో విజేతలను అభినందించిన ములుగు అడిషనల్ డిసిపి సాయి చైతన్య

#mulugupolice

రాష్ట్ర,జాతీయ స్థాయి లో 11 పోటీలలో గెలుపొందిన వరంగల్ జిల్లా క్రీడాకారులను వరంగల్ జిల్లా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అడిషనల్ డి సి పి సాయి చైతన్య అభినందించారు. కోచ్ తనుగుల అనిల్ అడిషనల్ డిసిపి సాయి చైతన్య కు పుష్ప గుచ్చం అందించారు.

జనవరి 1 ,2 రోజున హైదరాబాదులోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో 1స్ట్ స్టేట్ టైక్వాండో ఛాంపియన్ షిప్ 2022 పోటీలలో ములుగు నుండి 16 విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో ముగ్గురు  బంగారు పథకాలు, నలుగురికి కాంస్య పతకాలు, ఆరుగురికి రజత పతకాలు గెలుపొందడం జరిగినది. జనవరి 7 ,8 వ తేదీలలో

హైదరాబాదులోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన యూత్ నేషనల్ టైక్వాండో ఛాంపియన్ షిప్ 2022 పోటీలలో ములుగు నుండి తొమ్మిది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో 5 బంగారు పతకాలు, రెండు కాంస్య పతకాలు, రెండు రజత పతకాలు గెలుపొందారు. వీరందరినీ వరంగల్ జిల్లా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అడిషనల్ డి సి పి సాయి చైతన్య తన కార్యాలయం లో తైక్వాండో పోటీలలో గెలుపొందిన విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్భంగా అడిషనల్  డి.సి.పి సాయి చైతన్య మాట్లాడుతూ పిల్లలకు శారీరక మానసిక వికాసం కొరకు నేటి రోజుల్లో తప్పకుండా తైక్వాండో శిక్షణ అవరం అని అన్నారు. ములుగు జిల్లా లో కోచ్ తనుగుల అనిల్  చాలా మంచి శిక్షణ అందిస్తున్నారని కోచ్ ను అభినందించారు. ఎలాంటి అవసరం వున్నా తనవంతు పూర్తి సహకారం అందిస్తానని అన్నారు.

ఈ సందర్భంగా మిషన్ అల్ టి సి పి సాయి చైతన్య కోచ్ తనుగుల అనిల్ ని శాలువాతో సన్మానించారు.

కోచ్ తనుగుల అనిల్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల అవరణ లో సుమారు 40 మంది పిల్లలకు టైక్వాండో శిక్షణ ఇస్తున్నట్లు, టైక్వాండో శిక్షణ తీసుకోవడం కేవలం శారీరక మానసిక వికాసం కోసమే కాకుండా చదువు విజయవాడ లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ లలో కూడా సర్టిఫికెట్ ఉపయోగపడుతుందని తెలిపారు

అంతే కాకుండా ఇప్పటి వరకు పిల్లలు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక మెడల్స్ సాధించి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు నాగరాజు చల్ల గురుకుల రాజ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నో ఎస్సెన్స్: ఇది చాలా నిర్లిప్తమైన బడ్జెట్

Satyam NEWS

ఇమ్రాన్ ఖాన్ అరెస్టు: అల్లకల్లోలంగా పాకిస్తాన్

Satyam NEWS

అధికార పార్టీ రాజకీయ అనివార్యత ‘ఏకగ్రీవం’

Satyam NEWS

Leave a Comment