40.2 C
Hyderabad
April 29, 2024 18: 00 PM
Slider మెదక్

గజ్వేల్ ప్రభుత్వ స్కూల్ లో ఎన్ సి సి క్యాంప్

#NCC Camp

దసరా సెలవుల్లో గజ్వేల్ స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాల సముదాయంలో దేశ నలుమూలల నుండి రాబోయే యన్ సీ సీ కాడెట్లతో స్పె షల్ యన్ఐసీ క్యాంపును నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యన్ సీ సీ డిప్యూ టీ డైరెక్టర్ జనరల్ ఏయిర్ కమొడార్ వి. మధుసూదన్ రెడ్డి, నిజామాబాద్ గ్రూప్ అధికారి కల్నల్ సునీల్ అబ్రహం సోమవారం నాడు బాలుర డిగ్రీ కళాశాల, హాస్టల్, కళాశాల ఆడిటోరియం, గ్రౌండ్ మరియు మహతి ఆడిటోరియంలను సందర్శించారు. కళాశాల యన్ సీ సీ కాడెట్లు రాష్ట్ర డీడీజీ నకు, గ్రూప్ కమాండర్లకు గౌరవ వందనంతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేసీఆర్ నియోజక వర్గంలో ఉన్న సదుపాయాలను కొనియాడారు. దేశ నలుమూలల నుండి వచ్చే విద్యార్థులకి ఈ ప్రదేశం లో క్యాంపు చేయడం గొప్ప అవకాశంగా తెలిపారు. మన రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను తెలుపుతూ రాష్ట్ర నాయకత్వాన్ని తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించే విధంగా

ఈ క్యాంపు నిర్వహించనున్న ట్లు యన్ సీ సీ డీడీజీ తెలియజేశారు. దేశంలో ఎక్క డ లేని విధంగా ఈ ఎడ్యు కేషన్ హబ్ లని దాదాపు పదిహేడు యన్ సీ సీ డైరెక్టరేట్ ల నుండి వచ్చే అత్యుత్తమ కేడెట్ లు వినియోగించుకోవడం ఒక మంచి అవకాశంగా భావించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్న ల్ పీ యస్ నందా, సుబెదర్ మేజర్ సురేంద్ర గురుంగ్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రమేశ్ బాబు, యన్ సీ సీ ఆఫీసర్ లెఫ్టినెంట్ డాక్టర్ భవాని, అధ్యాపకులు మరియు యన్ సీ సీ బృందం పాల్గొన్నారు.

Related posts

వైసిపి పాలనతో రాష్ట్రం బ్రష్టు పట్టిపోయింది

Bhavani

డియస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

Satyam NEWS

కడప జిల్లా జడ్పీ చైర్మన్ గా అకేపాటి ప్రమాణ స్వీకారం

Satyam NEWS

Leave a Comment