Slider ముఖ్యంశాలు

ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్షంతో పసికందు మృతి

kamareddy doctors

వైద్యుల నిర్లక్ష్యంతో లోకాన్ని చూడకుండానే ఓ పసికందు మృత్యువాత పడింది. సకాలంలో ఆపరేషన్ చేయకపోవడంతో మృత శిశువు జన్మించింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ వారసుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు.

కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ఓ మృత శిశువు జననం ఆస్పత్రికి వచ్చిన రోగులను ఆందోళనకు గురి చేసింది. తాడ్వాయి మండలం కాళోజీవాడి గ్రామానికి చెందిన అమృతను కామారెడ్డి పట్టణానికి చెందిన వడ్ల శ్రీకాంత్ తో వివాహం జరిగింది. ఇక్కడ ఆమెను రజితగా పిలుస్తారు. అయితే ఆమె గర్బవతి కావడంతో డెలివరీ కోసం కాళోజీవాడి వెళ్ళింది.

గత మూడు రోజులుగా ఆమెకు పురిటి నొప్పులు రావడంతో జిల్లా ఆస్పత్రికి డెలివరీ కోసం వస్తున్నారు. ఆమె డెలివరికి ఇంకా సమయం ఉందంటూ ఆస్పత్రి వైద్యులు ఆమెని చేర్చుకోలేదు. మళ్ళీ బుధవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆస్పత్రికి తీసుకురాగా వైద్యులు ఆస్పత్రిలో చేర్చుకున్నారు.

నొప్పులతో ఇబ్బంది పడుతుందని, డెలివరీ చేయాలని కుటుంబ సభ్యులు వైద్యులను కోరగా ఆమెకి 16 వ తేదీ వరకు సమయం ఉంది. ఇప్పుడు అవసరం లేదంటూ దాటవేశారు. సాధారణ మందులు ఇస్తూ కాలయాపన చేశారు. ఏం జరిగినా తమదే బాధ్యతని, ఆపరేషన్ చేయాలని వైద్యులను వేడుకున్నారు.

అయినా వైద్యులు కనికరించలేదు. తెల్లవారుజామున అమృత(రజిత)కు ఆపరేషన్ చేయగా మృతి చెందిన శిశువు జన్మించింది. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తాము చెప్పినప్పుడు ఆపరేషన్ చేసి ఉంటే బిడ్డను కోల్పోయేవారిమి కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై ఆస్పత్రి సూపరిండెంట్ డా.అజయ్ కుమార్ ను వివరణ కోరగా 16 వ తేదీ వరకు ఆమెకు డెలివరీ సమయం ఉందని, అయినా ఆమెను ఆస్పత్రిలో చేర్చుకున్నామని అన్నారు. గర్భంలోనే శిశువు మృతి చెందాడని తెలిపారు.

Related posts

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో రెండో విడత కో వ్యాక్సీనేషన్ పూర్తి

Satyam NEWS

పల్నాడు జిల్లాలో ముగ్గురి దారుణ హత్య

Satyam NEWS

ఆత్మకూరు ప్రాంతంలో పెద్ద పులి పిల్లల కలకలం

Satyam NEWS

Leave a Comment