29.7 C
Hyderabad
April 29, 2024 10: 06 AM
Slider నిజామాబాద్

బస్సు ఛార్జీల పెంపుపై కాంగ్రెస్ ధర్నా

kamareddy bus

ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రధాన రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె తర్వాత ప్రభుత్వం బస్సు ఛార్జీలు పెంచడాన్ని నిరసించారు. బస్సు పైకి ఎక్కి నినాదాలు చేశారు.

ఈ సందర్బంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ… ప్రజల నడ్డి విరిచేలా ప్రభుత్వం చార్జీల భారం మోపడం సరికాదన్నారు. పెంచిన చార్జీల వల్ల ప్రజల నెత్తిన 2 వేల కోట్ల భారం పడుతుందని తెలిపారు. వెంటనే పెంచిన చార్జీలను రద్దు చేయాలని లేకపోతే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటమి తప్పదని హెచ్చరించారు.

Related posts

రైతులకు ఏక మొత్తంగా ఋణమాఫీ చేయాలని బ్యాంకు ఎదుట ధర్నా

Satyam NEWS

థ్యాంక్స్ టు కేసీఆర్: మహానగరానికి నిధుల పంట

Satyam NEWS

చెట్లు నరికితే క్రిమినల్ కేసులు

Murali Krishna

Leave a Comment