27.7 C
Hyderabad
April 26, 2024 05: 44 AM
Slider శ్రీకాకుళం

రాష్ట్రంలో వైసీపీ పాలనలో పెరిగిన ధరల ఘాటు

#TDP Srikakulam

రాష్ట్రం లో వైసీపీ పాలనలో పెంచిన పన్నుల పోటు,  పెరిగిన ధరల ఘాటు, మాత్రమే కనిపిస్తోందని  ప్రజారోగ్యం  కుంటుపడిందని, అభివృద్ధి  అడ్రస్ లేకుండా పోయిందని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ ధ్వజమెత్తారు.

రాష్ట్రం లో వైసీపీ  రెండేళ్లు పాలనలో  ఏ కోశానా అభివృద్ధి అన్నది లేదని దాని అడ్రస్ కనిపించడం లేదని విపరీతంగా ఆస్తిపన్ను పెంపు,  చెత్త పై పన్ను తదితర ప్రజావ్యతిరేక నిర్ణయాలతో పాటుగా  కరోనా సమయం లో ప్రభుత్వ నిర్లక్ష్యం  బాధ్యతారాహిత్యం తో  వేలాది ప్రాణాలు గాలి లో కలిసి పోయాయని ఆయన అన్నారు.

వీటిన్నిటి పై  రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం  ఈ నెల 16 నుండి 22 వరకు  టీడీపీ ఆధ్వర్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ నిరసన కార్యక్రమాలు  నిర్వహించడం జరుగుతోందని ఆయన తెలిపారు. శ్రీకాకుళం నగరంలో నియోజకవర్గం టీడీపీ  ఇంచార్జి గుండ లక్ష్మీదేవి ఆదేశానుసారం స్థానిక  ఎం. ఆర్. వో. వి. వి. ప్రసాద్  కి  కార్యాలయంలో వినతి పత్రం  అందించినట్లు ఆయన తెలిపారు.

అనంతరం నగర పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్,  జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు  పీ  జే. బాబు ,  జిల్లా మీడియా  కో ఆర్డినేటర్ డాక్టర్ జామి భీమ శంకర్ మాట్లాడుతూ కరోనా నియంత్రణ కు ప్రతీ ఒక్కరికి వాక్సిన్ వేయడమే మార్గమని అందువలన వాక్సి నేషన్  వేగవంతం చేయాలని కోరారు. మరింత ప్రాణ నష్టాలు జరగకుండా ప్రజలను కాపాడాలని

“ఆక్సిజన్ అందక మరణించిన కుటుంబాలకు 25 లక్షలు, బ్లాక్ ఫంగస్ తో మృతి చెందిన వారికి 20 లక్షలు,  ప్రతీ కోవిడ్  మృతి లకు 10 లక్షలు ఎక్స్ గ్రేషియా”  ఇవ్వాలని వారు డిమాండ్ చేసారు.

అలాగే  కరోనా సమయం లో లాక్ డౌన్ & కర్ఫ్యూ వలన  నష్టపోయిన సామాన్య  మధ్య తరగతి ప్రజలు,  ప్రైవేట్ ఉద్యోగులు, భవన నిర్మాణ కార్మికులు  ప్రైవేట్ టీచర్స్,  చిరువ్యాపారులకు, ప్రతీ  తెల్లకార్డు దారునికి 10 వేలు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

పెట్రోల్ & డీజీల్ ధరలపై కేంద్రం,  రాష్ట్రం  చెరో 10 రూపాయలు తగ్గించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు

ఇంకా ఈ కార్యక్రమం లో నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి  చిట్టి నాగ భూషణం, జిల్లా టీడీపీ కోశాధికారి ఇప్పిలి తిరుమలరావు,  టీడీపీ జిల్లా  కన్వినర్  ప్రధాన విజయరామ్, టీడీపీ నాయకులు 48 వ డివిజన్ ఇంచార్జి  సురకాశి వెంకటరావు, నాయకులు  పేరూరి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తిరుమల శ్రీవారికే శఠగోపం పెడుతున్న ప్రభుత్వం

Satyam NEWS

నేను అవ‌మానింప బ‌డ్డా…కానీ చ‌దువుతో సాధించా…క‌లెక్ట‌ర్ వెల్ల‌డి…!

Satyam NEWS

ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించండి

Satyam NEWS

Leave a Comment