కొత్తగా అమలు చేస్తున్న గోరు ముద్ద పథకాన్ని శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు డాక్టర్ కిల్లి కృపారాణి నేడు ప్రారంభించారు. టెక్కలి ప్రభుత్వ పాఠశాలలో జరిగి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె విద్యార్థిని విద్యార్థులకు పౌష్టిక ఆహార ఆవశ్యకతను వివరించారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్యాహ్నం సమయంలో పిలలకు పౌష్టికాహారం అందివ్వాలనే యోచనతో ఈ పథకాన్ని ప్రారంభించారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కృపారాణి తో బాటు జిల్లా వైఎస్సార్సీపీ మహిళ అధ్యక్షురాలు చింతాడ మంజు, నాయకులు టి.బి.జి గుప్తా, ధవళ కృష్ణ, సిహెచ్ జీవన్, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.