33.7 C
Hyderabad
April 28, 2024 00: 13 AM
Slider సినిమా

శివ నాగేశ్వర రావు స్టైల్ లో “దోచేవారెవారురా”

#anilravipudi

IQ క్రియేషన్స్ పతాకంలో మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం లాంటి విభిన్నమైన వినోదాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు శివనాగేశ్వరరావు నూతన నటీ నటులతో, బొడ్డు కోటేశ్వరరావుగారు రూపొందిస్తున్న సరికొత్త కామెడీ థ్రిల్లర్ చిత్రం దోచేవారెవరురా.. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి ప్రత్యేక పాత్రలలో కనిపించనున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లో ఒక సాంగ్ కోసం రామోజీఫిలిం సిటీలో ఒక సెట్ వేసి గ్రాండ్ గా చిత్రీకరించారు.ఈ పాట ను రమ్య బెహర్ అద్భుతం గా పాడింది.. సినిమా లో ఒక ముఖ్య సందర్భంలో ఈ సాంగ్ రాబోతోంది.

తాజాగా ఈ సినిమాలోని గుండాగాళ్లమండి.. లిరికల్ సాంగ్ ను టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి  విడుదల చేశారు. ఈ సందర్భంగా  దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ… “సాంగ్ చాలా బాగుంది. ఈ సినిమా శివ నాగేశ్వరరావు గారి స్టైల్ లో అందరిని అలరిస్తుందని ఆశిస్తున్నాను, ఆయన  కామెడీ  టైమింగ్ అద్భుతం. ఈ చిత్రం విజయం సాధించాలని..  చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

దర్శకులు: శివ నాగేశ్వరరావు, నిర్మాత: బొడ్డు కోటేశ్వరరావు, నిర్మాణం: IQ క్రియేషన్స్, పి.ఆర్.ఓ : లక్ష్మీ నివాస్

Related posts

మేళ్లచెరువు జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

Satyam NEWS

వనపర్తి నాలుగవ వార్డులో మంచినీటి సమస్యను పరిష్కరించాలి

Bhavani

15.78 ఎకరాల్లో సంపద వనాలు

Bhavani

Leave a Comment