42.2 C
Hyderabad
May 3, 2024 17: 54 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తి నాలుగవ వార్డులో మంచినీటి సమస్యను పరిష్కరించాలి

వనపర్తి జిల్లా కేంద్రంలోని నాలుగో వార్డులో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని స్థానిక కౌన్సిలర్. పద్మ -పరుశురాం సోమవారం కలెక్టర్ ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్. వేణుగోపాల్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని నాల్గవ వార్డు కుమ్మరివిధి, బాలనగర్, నర్సింగాయిపల్లి లో గత మూడేళ్లుగా మంచినీటి సమస్యతో కాలనీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పలుమార్లు మున్సిపాలిటీలో అనేక ఆర్జీలు పెట్టుకోవడం జరిగిందని, దీంతో మున్సిపాలిటీ అధికారులు తాత్కాలిక చర్యలు చేపడుతూ చేతులు దులుపుకుంటున్నారని తెలిపారు. నర్సిoగాయిపల్లి మున్సిపాలిటీకి 4 కిలో మీటర్ల దూరంలో ఉందని పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఈ సమస్య గురించి స్థానిక కౌన్సిలర్.

పద్మ -పరుశురాం మిషన్ భగీరథ ఈఈ దృష్టికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. సెయింట్ థామస్ స్కూల్ నుంచి పైపు లైను వేసినప్పటికి… జేరిపోతుల మశమ్మ వాగు వద్ద పనుల్లో జాప్యం జరిగిందని, వెంటనే సమస్యను పరిష్కరించి… కాలనిలో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి

Satyam NEWS

కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్

Bhavani

రేపటి నుంచి మేజర్ పోర్ట్ క్రికెట్ చాంపియన్ షిప్ క్రికెట్

Satyam NEWS

Leave a Comment