37.2 C
Hyderabad
May 6, 2024 13: 42 PM
Slider గుంటూరు

కరోనా ఎలర్ట్: వ్యక్తిగత శుభ్రత తోనే కోవిడ్19 నివారించవచ్చు

guntur 1

నరసరావుపేట పార్లమెంట్ కేంద్రంలో ఉన్న  సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థినుల వసతి గృహంలో హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్స్ ను విద్యార్థినులకు విద్యుత్ శాఖ గుంటూరు జిల్లా సుపరింటెండింగ్ ఇంజనీర్ యమ్ విజయకుమార్ అందజేశారు. రోడ్డు సేఫ్టీ యన్. జి.ఓ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ కుమార్ మాట్లాడుతూ కోవిడ్19 వైరస్ ప్రపంచదేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని అన్నారు. కోవిడ్19 బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకుంటున్నాయని, ప్రజల్లో అవగాహన కోసం యన్. జి. ఓ ల సహకారం అందించాలని కోరారు.

సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థినులు వసతి గృహంలో హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్స్ ను వాడుకోవాలని తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని ఆయన అన్నారు. తుమ్మినప్పుడు దగ్గినప్పుడు నోటికి కర్చీఫ్ అడ్డు పెట్టుకోవాలని ఆయన తెలిపారు.

విదేశాల నుండి వచ్చిన వారు తప్పనిసరిగా హెల్త్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. బాలికల వసతి గృహంలో వివిధ ప్రాంతాల నుండి చదువుకోవడం కోసం వచ్చిన మీరు అందరూ వ్యక్తిగత పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాట్లాడుతూ కరోన వైరస్ పట్ల ముందు జాగ్రత్తలు తీసుకుంటే దానిని నివారించడం సాధ్యమే అన్నారు.

అనంతరం నరసరావుపేట డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కొండలు, కోటేశ్వరరావు హ్యాండ్ వాష్ లిక్విడ్ అందజేశారు. ముఖ్య అతిథి యమ్.విజయ కుమార్ ను శాలువాతో రాంబాబు, రామకృష్ణ బంగారయ్య లు సత్కరించారు.

Related posts

నిరుపేదల పాలిట వరం.. సీఎంఆర్ఎఫ్ పథకం

Satyam NEWS

కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన కృష్ణ

Murali Krishna

బాంబు దాడిలో  15మంది పిల్లలు మృతి

Murali Krishna

Leave a Comment