23.7 C
Hyderabad
May 8, 2024 03: 35 AM
Slider ఆదిలాబాద్

మా పోలీస్ స్టేషన్ పరిధి కాదు అని చెప్పవద్దు

sp nirmal 14

అత్యవసర ఫిర్యాదులు వస్తే ఇది తమ పోలీస్ స్టేషన్ పరిధి కిందికి రాదు అని చెప్పవద్దని నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే సిఐ పర్మిషన్ తీసుకుని అవసరమని భావిస్తే సంబంధిత ఫిర్యాదును ఆన్ లైన్ లో నమోదు చేయాలని రిసెప్షన్ అధికారులను ఆయన ఆదేశించారు.

ఈ పరివర్తనకు సంబంధించి పోలీసు అధికారులకు ఆయన ఒక రోజు శిక్షణ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులు ఇతర ప్రాంతం వారైనా సరే పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసినట్లైతే వారి సమస్యలను సావధానంగా వినాలని ఎస్పీ చెప్పారు. ఆ తర్వాత  SHO అనుమతి తీసుకొని వెంటనే ఆ పిటిషన్ ను ఆన్ లైన్ లో నమోదు చేయాలనీ చెప్పారు.

అలా కాకుండా వేరే పోలీస్ స్టేషన్ కు పంపవద్దని, బాలికలు, మహిళల అత్యవసర ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఎస్పీ ఆదేశించారు. మీ ద్వారా చేతనైనంత సహాయం చేసి మీ పై అధికారులకు కేసు తీవ్రతను తెలిపినట్లైయితే తదుపరి చర్యలను అధికారులు తీసుకుంటారని ఆయన అన్నారు.

పోలీస్ స్టేషన్ లో చేసే ప్రతి పని రికార్డు ఉండాలని, చాల పోలీస్ స్టేషన్ లలో రికార్డు లు సంతృప్తికరంగా ఉన్నాయని వాటిని అలాగే క్రమము తప్పకుండా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్.పి. అడ్మిన్ శ్రీనివాస్ రావు, నిర్మల్ రూరల్ సి.ఐ. శ్రీనివాస్ రెడ్డి, ఐ.టి. కోర్ ఇంచార్జీ యస్.కే. మురాద్ అలీ, అన్ని పోలీస్ స్టేషన్ ల రిసెప్షన్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఆర్థిక సహాయనికి గడువు పెంచాలి

Bhavani

అసమ్మతికి ఆజ్యం: వనపర్తిలో జూపల్లి సమాలోచనలు

Satyam NEWS

మేధావులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి

Satyam NEWS

Leave a Comment