తెలంగాణలో రైతు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి వరి ధాన్యం కొనుగోలు విషయంపై చర్చలు జరిపారు. రైతులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేసేందుకు కూడా ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. రైతులు ఇబ్బంది పడవలసిన అవసరం లేదని ధాన్యం అమ్మకం సందర్భంగా వచ్చే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లు కూడా పూర్తిస్థాయిలో సహకరించాలని మంత్రి కోరారు. సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ఆయన లక్ష్యాన్ని నిర్దేశించారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించి రైతుల నుంచి ధాన్యం సేకరించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
previous post