26.7 C
Hyderabad
May 3, 2024 10: 28 AM
Slider మహబూబ్ నగర్

జాతీయ రహదారి ఏర్పాటుకు అనుమతుల పట్ల హర్షం

#Nitin Gadkari

కల్వకుర్తి నుండి నంద్యాల వరకు జాతీయ రహదారి ఏర్పాటు చేస్తామని అనేక రాజకీయ పార్టీలు ఎన్నికలలో హామీలు ఇచ్చి వాటిని తుంగలో తొక్కాయి. గత పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసిన బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి కూడా జాతీయ రహదారి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఎన్నికలలో ఓడిపోయినా కూడా తాను ఇచ్చిన హామీకే బంగారు శృతి కట్టుబడి ఉన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ తో  నిధులను మంజూరు చేయించారు.

కొల్లాపూర్ నియోజక వర్గంలో సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని ఇచ్చిన హామీ మేరకు జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా 765 కోట్ల నిధులతో కల్వకుర్తి నుండి నంద్యాల వరకు సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి మీదుగా జాతీయ రహదారి ఏర్పాటు అనుమతులు ఇచ్చారని ఆమె వివరించారు.

పార్లమెంట్ ఎన్నికల అనంతరం జిల్లా నాయకులతో కలిసి  ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్ర మంత్రులను కలిసి కోరడం వల్లే సాధ్యమైంది అని ఆమె అన్నారు.

బిజెపి కృషితో నిధులు మంజూరైతే అధికార పార్టీ ఎమ్మెల్యే ఎంపీ తాము సాధించినట్లు గొప్పలు చెప్పుకోవడం ఆర్భాటాలు చేయడం దారుణమని అన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తాము అధికారంలో లేకపోయినా కేంద్ర ప్రభుత్వం తో చర్చిస్తున్నట్లు యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభం చేసి వెంటనే పనులు పూర్తి చేయాలని తాము కోరుతున్నట్లు తెలిపారు

Related posts

డబుల్ బెడ్ రూంల నిర్మాణం నాణ్యతతో ఉండాలి

Satyam NEWS

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

Satyam NEWS

కరోనా రోగుల కోసం ఆక్సిజన్ కాన్సన్ అందజేసిన జనసేన

Satyam NEWS

Leave a Comment