40.2 C
Hyderabad
May 2, 2024 18: 39 PM
Slider వరంగల్

రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలి

#Private Teachers

రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సమయంలో ప్రైవేటు ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోయి కుటుంబ బతుకు భారంగా మారి కూలి పనులకు వెళుతూ కూడా కుటుంబాన్ని నడపలేని పరిస్థితిలో ఉన్నారని భారతీయ జనతా యువమోర్చా జిల్లా మాజీ ఉపాధ్యక్షులు రాయంచు నాగరాజు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నిరుద్యోగ భృతి ని వెంటనే అమలు చేసి , మన తెలంగాణలో అతి పెద్ద పండుగ అయిన బతుకమ్మ , దసరా పండుగను ఘనంగా జరుపుకునే విధంగా ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆర్థికపరంగా ఆదుకోవాలని కోరారు.

ప్రైవేటు ఉపాధ్యాయులు కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్షల ఉద్యోగాలు వస్తాయని ఎంతోమంది యువకులు ఎదురు చూశారు అని  కానీ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటివరకు వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయారని ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత అని అన్నారు.

కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగుల పట్ల దయ చూపి నిరుద్యోగ భృతి అమలు చేసి వారి కుటుంబాలని ఆదుకోవాలని కోరారు. లేనియెడల వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళ సత్తా చూపెడతారు అని అన్నారు.

Related posts

వంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం చేసిన వాలంటీర్

Satyam NEWS

సీఎం కేసీఆర్ 12 గంటల బడ్జెట్ కసరత్తు

Satyam NEWS

బి ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోనున్న రాగిడి లక్ష్మారెడ్డి

Satyam NEWS

Leave a Comment