38.2 C
Hyderabad
May 5, 2024 19: 54 PM
Slider ముఖ్యంశాలు

ఎన్‌ఎం‌సి సంతృప్తి చెందాలి

#ajay

తొమ్మిది మెడికల్‌ కాలేజీలు ప్రారంభించే లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 87 మందికి ప్రమోషన్లు ఇచ్చినట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. 210 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు వారం రోజుల్లో కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోతున్న తొమ్మిది మెడికల్‌ కాలేజీలకు సంబంధించిన పనులపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు  ఆయా జిల్లా మంత్రులు, జిల్లా కలెక్టర్ సంభందిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాలేజీల విషయంలో సమన్వయం కోసం మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఆయా జిల్లా కలెక్టర్లతో మంత్రి మాట్లాడారు. ఆయా కళాశాలల్లో 1,442 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ చివరి దశకు చేరిందని, రెండు మూడు రోజుల్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసి, పది రోజుల్లో తుది నియామక పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌన్సెలింగ్‌ నిర్వహించి తొమ్మిది మెడికల్ కాలేజీల్లో వీరిని నియమించేందుకు రంగం సిద్దం చేసినట్లు వెల్లడించారు. తరగతులు ప్రారంభమయ్యే నాటికి అవసరమైన ఫర్నీచర్, ఎక్విప్మెంట్ సిద్ధం చేయాలని, ఆయా బాధ్యత మంత్రులు తీసుకోవాలని సూచించారు.

సీఎం కేసీఆర్ మార్గానిర్దేశనంలో గతేడాది 8 మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామని, ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎంబీబీఎస్ అకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. అన్ని కాలేజీలు నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అనుమతులు పొందేలా సిద్దంగా ఉండాలన్నారు. ఎన్ఎంసీ నిబంధనలు సంతృప్తి చెందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం జిల్లాలో మెడికల్ కళాశాల ఎర్పాటు కు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నామని, పాత కలెక్టరేట్ భవనంలో తరగతులు నిర్వహించేందుకు తగు ఎర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమాలకు లోబడి తరగతులు నిర్వహించేందుకు ఇప్పటికే ఎర్పాటు చేసినట్లు వివరించారు.

Related posts

శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న గవర్నర్ తమిలి సై

Bhavani

బ్రాహ్మణులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షం

Satyam NEWS

రాజ్ న్యూస్ రిపోర్ట‌ర్ కుటుంబానికి చెక్ పంపిణీ….!

Satyam NEWS

Leave a Comment