42.2 C
Hyderabad
April 30, 2024 17: 39 PM
Slider ముఖ్యంశాలు

బ్రాహ్మణులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షం

vellampally

వంశపారంపర్య అర్చకత్వంపై జారీ చేసిన జీవో 439 నేడు  కార్యరూపం దాల్చింది. ఈ ఉత్తర్హులను అనుసరించి పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం వల్లిపాడు గ్రామానికి చెందిన మధనగోపాలస్వామి ఆలయ అర్చకుడిగా తిరిగి నియమిస్తూ నియామక పత్రాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ బ్రాహ్మణ వీధి కార్యాలయంలో అందజేశారు.

వంశపారంపర్య అర్చకత్వ జీవో కార్యరూపం దాల్చడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి  అన్నారు. అర్చకుల వంశపారంపర్యంపై నాడు వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి తెచ్చిన జీవోను సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సవరించి అమల్లోకి తెచ్చారని మంత్రి పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే సీఎం వైయస్‌ జగన్‌ బ్రాహ్మణులపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారన్నారు.

 వంశపారంపర్య అర్చకత్వాన్ని కొనసాగించేందుకు జీవోను సవరించారని తెలిపారు. రాష్ట్రంలో ఆలయాల పునురుద్ధరణ, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టమని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారన్నారు. అందులో భాగంగా అన్ని ఆలయాలకు ధూపదీప నైవేద్యాలకు నిధులు కేటాయించారని పేర్కొన్నారు.

Related posts

చిలకలూరిపేట తహసీల్దార్ గా తిరిగి బాధ్యతలు చేపట్టిన సుజాత

Satyam NEWS

సహాకరిస్తే కొద్ది కాలం బతుకుతాం, లేకుంటే అర్ధాంతరంగా పోతాం

Satyam NEWS

ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్

Satyam NEWS

Leave a Comment