39.2 C
Hyderabad
April 28, 2024 11: 31 AM
Slider ఖమ్మం

అగ్రస్తానంలో రాహుల్

#korukonda

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరచి, ఇటీవల ఆల్ ఇండియా స్థాయిలో జరిగిన సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో ఖమ్మం పట్టణం పాండురంగాపురమునకు చెందిన గాలిపెల్లి ఉపేందర్ కుమారుడు, గాలిపెల్లి రాహుల్ ను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అభినందించారు. ఈ సందర్భంగా పాత కలెక్టరేట్ లో కలెక్టర్ ను కలిసిన రాహుల్ ను, ప్రతిభ కనవరచి, 264 మార్కులు సాధించి, ఆల్ ఇండియా లెవెల్ లో 1004, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచి, ఖమ్మం జిల్లా కీర్తిని చాటాడాని కలెక్టర్ ప్రశంసించారు. విజయనగరంలో  జరిగిన మెడికల్ పరీక్ష నందు ఫిట్ పొంది, కోరుకొండ సైనిక్ స్కూల్ లో సీటు దక్కించుకున్నట్లు, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఎంట్రన్స్ లో  అర్హత సాధించి, ఇంటర్వ్యూకు ఎంపిక అయ్యాడని ఆయన తెలిపారు. రాహుల్ ఉన్నతంగా ఎదగాలని కలెక్టర్ అభిలాషించారు.

Related posts

జర్నలిస్టుల సంక్షేమానికి మేం కట్టుబడి ఉన్నాం

Satyam NEWS

నో మెర్సీ :క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించారు

Satyam NEWS

సినీ నటుడు సంపూర్ణేష్ బాబుకు పెను ప్రమాదం

Satyam NEWS

Leave a Comment