30.7 C
Hyderabad
April 29, 2024 06: 58 AM
Slider ఆదిలాబాద్

రసవత్తరంగా మారిన సిర్పూర్ రాజకీయం

#konerukonappa

కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలలో కోనేరు కోనప్ప కు సరైన ప్రత్యర్థి లేనందున ఆయన గెలుపు సునాయాసమేనని ఇప్పటి వరకూ అందరూ అనుకున్నారు. కానీ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పోరు రసవత్తవరంగా మారే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోనప్పకు ఏ పార్టీలో కూడా బలమైన అభ్యర్థి లేరు.

ఆయనకు ఎదురే లేదు అని అనుకునే సమయంలో బిఎస్పి నుండి ఆర్ఎస్ ప్రవీణ్ రంగంలోకి రావడంతో రసవత్తరమైన పోరు ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గమే. అదీగాక రాష్ట్రంలో మంచి పేరు ప్రఖ్యాతులు గల మాజీ ఐపీఎస్ అని ప్రవీణ్ కు పేరు ఉంది. అంతేగాక ఏనుగు గుర్తుతో కోనప్ప ఒకసారి గెలిచారు.

గుర్తు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కు అనుకూలమైన అంశంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కోనప్ప పరంగా చూస్తే బలమైన క్యాడర్ ఉంది. లోకల్ లో అందరికీ అందుబాటులో ఉంటాడని, సహాయ సహకారాలు చేస్తాడని పేరు ఉంది. 2019లో కాంగ్రెస్ నుండి పాల్వాయి హరీష్ గట్టి పోటీ ఇచ్చారు కానీ రాను రాను ఆయన క్యాడర్ తగ్గిపోవడం ఇతర పార్టీకి మారడం వల్ల ఆయన అంత గట్టి అభ్యర్ధి అని పెంచుకునే అవకాశం తక్కువగా ఉంది.

ఆయన కూడా బీజేపీలోకి మారడం, అక్కడ అప్పటికే స్థిరమైన నాయకులు ఉండటం లాంటి పరిణామాలన్నీ పాల్వాయి హరీష్ కు మైనస్ అంటున్నారు. అదీగాక సీనియర్ నాయకుడుగా బిజెపిలో కొత్తపల్లి శ్రీనివాస్ ఎప్పటినుండో ఉంటున్నారు. ఆయనను కాదని పాల్వాయికి టికెట్ ఇస్తారా అని బిజెపి నాయకులు అనుకుంటున్నారు. ఓకే ఓరలో రెండు కత్తులు ఇమిడవు  అని సామెత ఉంది.

హరీష్ బిజెపిలో చేరినా కానీ ఇప్పటివరకు కొత్తపల్లి శ్రీనివాస్ తో కలిసికట్టుగా పనిచేసినదే లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వీరి వ్యవహారం నడుస్తుంది. వీరిద్దరిలో ఎవరికి టికెట్ వచ్చినా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోరు. కావున బిజెపికి ఈ నియోజకవర్గం లో మైనస్ అంటున్నారు. కాంగ్రెస్ విషయానికి వస్తే రావి శ్రీనివాస్ 2019లో టికెట్టు ఆశించి భంగపడ్డారు. తర్వాత బీఎస్పీలో చేరారు.

ఆ తర్వాత బిజెపిలో చేరి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు. కానీ రావి శ్రీనివాస్ వెళ్లిన సమయంలో కృష్ణారెడ్డి నియోజకవర్గ బాధ్యతలు చూసుకున్నారు. మరి అతను కూడా టికెట్ ఆశిస్తున్నారని కాంగ్రెస్ లో ఒక వాదన వినిపిస్తుంది.

Related posts

అక్రమ రిజిస్ట్రేషన్లు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు: కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ శ్రీలత

Satyam NEWS

జపనీస్ పార్కును సద్వినియోగం చేసుకోవాలి

Bhavani

మద్యం షాపులు తెరిచి రాష్ట్రాన్ని ఆగం చేశారు

Satyam NEWS

Leave a Comment