28.7 C
Hyderabad
April 27, 2024 05: 46 AM
Slider ఆదిలాబాద్

చర్యలు తీసుకోకుండా తప్పు కప్పేస్తున్న ఎక్సయిజ్ శాఖ

wines shop 121

సీల్ ఓపెన్: అమ్మేవాడికి లక్కు తాగేవాడికి కిక్కు శీర్షికతో సత్యం న్యూస్ పోస్టు చేసిన వార్తతో ఒక్క సారిగా ఎక్సయిజ్ అధికారులకు కిక్కు దిగినట్లు కనిపిస్తున్నది. కొమరం భీం జిల్లా పెంచికల్ పేట్ మండలంలోని ఆదిత్యా వైన్స్ లోని స్టాక్ రాత్రికి రాత్రి తీసేసి బ్లాక్ లో అమ్ముకుంటున్నారని సత్యం న్యూస్ వెలుగులోకి తీసుకువచ్చింది.

షాపు సీల్ ఓపెన్ చేసి ఉన్నా ఎక్సయిజ్ అధికారులు పట్టించుకోని వైనాన్ని కూడా సవివరంగా తెలియచేయడంతో రాత్రి గుట్టు చప్పుడు కాకుండా ఎక్సయిజ్ అధికారులు అక్కడకు వచ్చారు. షాపు నకు మళ్లీ సీల్ వేశారు. షాప్ కు మళ్లీ సీల్ వేయడం ఏమిటి?

అసలు సీల్ తీసి బ్లాక్ లో అమ్ముకుంటున్న వారిని పట్టుకోవాలి కదా? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే తాము ఈ చర్య తీసుకుంటున్నామని, ఇంతకు మించి తమకు తెలియదని స్థానిక ఎక్సయిజ్ అధికారులు అంటున్నారు.

స్థానిక ఎక్సయిజ్ అధికారులకు తెలియకుండా వైన్స్ షాపుల వారు ఇంత బరితెగించరనే విషయం అందరికి తెలిసిందే. కరోనా మహమ్మారి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో మద్యం సరఫరా బంద్ అయింది. మద్యం షాపులను ప్రభుత్వం చట్టప్రకారం మూసేసింది.

అయితే రాష్ట్రంలో చాలా చోట్ల షాపులు తెరిచి గుట్టు చప్పుడు కాకుండా మద్యం బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. పెంచికల్ పేట్ లో జరిగిన ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసింది. తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు కానీ స్టాక్ ఎంత తరలిపోయిందో మాత్రం చూడటం లేదు. ఇది ఎక్సయిజ్ అధికారుల పనితీరును ప్రశ్నించే విధంగా ఉంది. ఇందులో ఎవరెవరు కుమ్మక్కయి ఉన్నారనే విషయం విచారణ చేస్తేగానీ తెలియదు.

Related posts

వనపర్తి పోలీస్ ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ

Satyam NEWS

ఆపర్చ్యూనిటీ: గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

Satyam NEWS

ఆ వెలుగులకే నా ప్రస్థానం

Satyam NEWS

Leave a Comment