31.2 C
Hyderabad
May 2, 2024 23: 41 PM
Slider రంగారెడ్డి

ఎక్కడి అభివృద్ధి అక్కడే.. ఇవేనా దశాబ్ది ఉత్సవాలు..?

#shadnagar

ఎక్కడి అభివృద్ధి అక్కడే, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే  అన్నచందంగా ఇవే నా దశాబ్ది ఉత్సవాలని పిసిసి సభ్యులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ ప్రశ్నించారు. సోమవారం షాద్ నగర్  గాంధీనగర్ కాలనీలో డ్రైనేజీ దుస్థితిపై మీడియా దృష్టికి తీసుకోవచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాద్ నగర్ యావత్తు సమస్యల వలయం అంటూ విమర్శించారు.

రూ. 33.50 లక్షల ప్రజాధనం మున్సిపాలిటీ నిధులతో దశాబ్ది ఉత్సవాలు అవసరమా అని నిలదీశారు.అధికారులతో ఉత్తి గొప్పలు గప్పాలు చెప్పించుకుంటున్న ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. గాంధీనగర్ సమస్య తీర్చకుంటే మున్సిపాలిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడి అభివృద్ధి పనులు అక్కడే వదిలేసి లక్షలాది రూపాయల ప్రజా ధనం వెచ్చించి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారని అధికారులతో లేని అభివృద్ధి గురించి గొప్పలు చెప్పిస్తున్నారని, షాద్ నగర్ యావత్తు సమస్యల వలయం అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ ఘాటు విమర్శలు చేశారు. 

షాద్ నగర్ పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ నరేందర్ సొంతవార్డు గాంధీనగర్ కాలనీలో సమస్యకు నిలయమైన డ్రైనేజీ కాలువ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల తొమ్మిదవ తేదీన వర్షానికి గాంధీనగర్ కాలనీలో పాత జాతీయ రహదారి పక్కన సమస్య ఏర్పడి ఎంతోమంది రోడ్డున పడ్డారని అదేవిధంగా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయని పేర్కొన్నారు. మీడియా బృందాన్ని పిలిచి సమస్యను వివరించారు.

అనంతరం పి రఘు మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ సొంతవార్డులోనే ఈ దుస్థితి ఏర్పడితే మిగతా వార్డుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇన్ని రోజుల నుండి ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన ఈ రహదారి డ్రైనేజీ సమస్యపై మున్సిపల్ కమిషనర్, చైర్మన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో షాద్ నగర్ మున్సిపాలిటీలో 33.50 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి గొప్పగా నిధులు తగలేస్తున్నారని అన్నారు.

అభివృద్ధి పనులు గాలికి వదిలేసి పైపై మెరుగులతో మున్సిపాలిటీ గొప్పలు చెప్పుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు తెరిస్తే అధికారులు కూడా అబద్ధాలు ఆడుతున్నారని ప్రభుత్వానికి వంత పాడుతున్నారని దుయ్యబట్టారు. అడిషనల్ కలెక్టర్ నుండి మొదలుకొని కిందిస్థాయి సిబ్బంది వరకు ప్రభుత్వ గురించి గొప్పలు చెబుతున్నారని ఎంతో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందని చెబుతున్నారని తమ వెంట వస్తే పట్టణంలో ఎంత అభివృద్ధి జరిగిందో అధికారులకు కళ్లకు కట్టినట్టు చూపిస్తామని సవాల్ విసిరారు.

దశాబ్ది ఉత్సవాల పేరిట మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు లాభపడ్డారని ప్రజలు ఒరిగింది ఏమీలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని ఎంతో నిరుపయోగం చేస్తున్నారని అన్నారు. త్వరలోనే వాటిని మీడియా ముందుకు తీసుకువచ్చి వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని హెచ్చరించారు.

దశాబ్ది ఉత్సవాల ముసుగులో టిఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకుంటుందని ఎన్నికలకు ముందు తప్పుడు దారిలో  ప్రభుత్వం ప్రజలను తప్పు పట్టిస్తున్నారని తెలిపారు. సమస్యలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తామని సూచించారు. వెంటనే ఈ పనులు చేపట్టకపోతే మున్సిపాలిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు అలీమ్ షకీబ్, గంగమోని సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

సైరా పైరసీ వెర్షన్ విడుదలతో ఆందోళన

Satyam NEWS

భార్య మృతి-భర్త పరిస్థితి విషమం

Bhavani

కరప్షన్ స్పెషల్: అంతా ఇంతా కాదు దొరికింది రెండు వేల కోట్లు

Satyam NEWS

Leave a Comment