34.7 C
Hyderabad
May 4, 2024 23: 28 PM
Slider ప్రత్యేకం

‘‘రాజ్యాంగ పరిరక్షణ యజ్ఞంలో జైలుకు వెళ్లడానికి వెనుకాడను’’

#Nimmagadda

రాజ్యాంగాన్ని పరిరక్షించే ఈ మహాయజ్ఞంలో జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేననే స్థిరమైన అభిప్రాయంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనిచేస్తున్నారు. 40 సంవత్సరాల తన విధి నిర్వహణలో ఏ రోజూ ఏ తప్పు చేయలేదని, అందువల్ల తాను ఎవరికి భయపడే ప్రశ్నేలేదని ఆయన తన సన్నిహితుల వద్ద అంటున్నట్లు తెలిసింది.

 ఎన్నో పెద్ద పదవుల్లో ఉన్న తాను ప్రజలకు ఉపకరించే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నానని అలాంటిది రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండగా తాను ప్రజలకోసం పని చేయకపోతే ఎలా అని ఆయన తన సన్నిహితులతో అంటున్నారు. ఐఏఎస్ అధికారిగా రాగద్వేషాలకు అతీతంగా పని చేసిన చరిత్ర తనకు ఉందని, రాజకీయంగా తాను ఎప్పుడూ ఎవరి నుంచి ఏ విషయంలో కూడా సహాయం తీసుకోలేదని రమేష్ కుమార్ వ్యాఖ్యానిస్తున్నారు.

ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో రాజీపడని వ్యక్తిత్వం

ఆయన పుట్టిన గుంటూరు జిల్లా దుగ్గిరాల నుంచి ఎంతో మంది ఉన్నత చదువులు చదువుకున్నవారు ఉన్నారు. ఆ ఊరు నుంచి ముగ్గురు ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. అందులో నిమ్మగడ్డ రమేష్ కుమార్  ఒకరు. గౌరవ ప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన తాను ఎవరితో ఏ పరిస్థితిలోనూ ఇప్పటి వరకూ రాజీ పడలేదని ఆయన తన సన్నిహితల వద్ద అంటున్నారు.

ఏ పదవి నిర్వహించినా హుందాగా, నిజాయితీగా నిర్వహించిన సమర్ధుడైన అధికారిగా డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరు తెచ్చుకున్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ కార్యదర్శిగా, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శిగా, తిరుమల తిరుపతి దేవస్థానాల ముఖ్య కార్యనిర్వహణాధికారిగా కూడా పని చేసిన రమేష్ కుమార్, విద్యార్ధి దశ నుంచే తన ప్రత్యేకతను నిలుపుకుంటూ వస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో ఒక రోజు జైలు జీవితం

ఎస్ వి యూనివర్సిటీలో చదువుతుండగా ఆయన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఒక సందర్భంలో ఎస్ వి యూనివర్సిటీలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న ఇద్దరు విద్యార్ధుల్ని పోలీసులు అరెస్టు చేశారు. అందులో ఒకరు డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.

ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విద్యుక్త ధర్మంలో ఒక రోజు మొత్తం జైల్లో ఉన్న అనుభవం కూడా ఆయనకు ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  విద్యార్ధుల్లో క్రమశిక్షణ పెంచేందుకు, వారిలో నైతిక వర్తన తీసుకువచ్చేందుకు ఎస్ వి యూనివర్సిటీలో ఉన్న సమయంలోనే రమేష్ కుమార్ యూనీ టైమ్స్ అనే పత్రికను తన మిత్ర బృందంతో కలిసి నడిపేవారు.

విద్యార్ధి దశ నుంచే ఆదర్శ భావాలు  

విద్యార్ధి దశ నుంచే ఆదర్శ భావాలతో ఉన్న రమేష్ కుమార్ ప్రలోభాలకు, బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదని ఆయనను సన్నిహితంగా గమనించిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. రాజ్యాంగాన్ని సంరక్షించేందుకు తాను ప్రయత్నిస్తున్నానని ఆయన అంటున్నారు.

ఈ పోరాటంలో తనను నిర్బంధించినా భరించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చట్టాన్ని తాను కాపాడితే తనను చట్టం కాపాడుతుందనే దృక్పథంతో తాను ముందుకు వెళుతున్నట్లు  రమేష్ కుమార్ అంటున్నారు. ఎవరికి భయపడేదిలేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన సన్నిహితులతో కూడా స్పష్టం చేస్తున్నారు.

 రాజ్యాంగ పదవిలో ఉన్న తనపై విమర్శలు చేస్తున్నా వారే ఫిర్యాదులు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగతంగా తనపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభ్యులు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చినట్లు పత్రికల్లో చూస్తున్నానని అయితే తాను ఎక్కడా ఎవరిని ఎలాంటి పరుష పదజాలంతో విమర్శించలేదని రమేష్ కుమార్ తన సన్నిహితులతో వ్యాఖ్యానించారు.

తనను కించపరిచే వారిని కూడా వ్యక్తిగతంగా విమర్శించని నైజం

తనను కొందరు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఎంతో న్యూనత పరిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజ్యాంగం ప్రకారం తన విధిని తాను నిర్వర్తిస్తున్నందున తనకు ఎలాంటి ఇబ్బంది రాదని ఆయన భావిస్తున్నారు.

క్లిష్ట సమయంలో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉన్నదని, ప్రస్తుత పదవి కాలం పూర్తయ్యే వరకూ అనుక్షణం రాజ్యాంగ పరిరక్షణలోనే తాను ఉంటానని ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటున్నారు. రాజ్యాంగ పరిరక్షణలో తనకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఫర్వాలేదన్నట్లే ఆయన వైఖరి ఉందని కూడా ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

హైదరాబాద్‌లో అధ్యయనానికి కోవిడ్ 19 బృందం

Satyam NEWS

అర్నబ్ గోస్వామిపై రూ.200 కోట్ల పరువునష్టం

Satyam NEWS

మూలన పడ్డ “మహారాజ”…గుర్తులు..

Satyam NEWS

Leave a Comment