26.7 C
Hyderabad
April 27, 2024 08: 48 AM
Slider హైదరాబాద్

హైదరాబాద్‌లో అధ్యయనానికి కోవిడ్ 19 బృందం

#Central Team

రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా కేసుల విషయాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రత్యేక బృందం హైదరాబాద్ తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక అధ్యయనానికి కేంద్రం ప్రత్యేక బృందాలను పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్ కు కేంద్ర బృందం వచ్చింది.

ఈ  బృందం సభ్యులు సోమవారం వివిధ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షా కేంద్రాలను పరిశీలిస్తారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఏదైనా కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌లో పర్యటిస్తారు. అక్కడి నుంచి నేరుగా బీఆర్కే భవన్‌లో రాష్ట్ర సీఎస్, ఆరోగ్యశాఖ అధికారులతో భేటీ అవుతారు. సాయంత్రం గాంధీ ఆస్పత్రిని సందర్శించి అనంతరం గచ్చిబౌలీలోని టిమ్స్‌ ఆస్పత్రిని సందర్శిస్తారు.

అక్క‌డ నుంచి ఔటర్‌ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ చేరుకుని ఢిల్లీకి పయనమవుతారు. ప్రధానంగా తెలంగాణలోని హైదరాబాద్, గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, తమిళనాడులోని చెన్నై, మహారాష్ట్రలోని థానే నగరాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే.

తెలంగాణతో పాటు గుజరాత్‌, తమిళనాడు, మహారాష్ట్రలో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటించి, కరోనా వైరస్‌పై పరిస్థితిని అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వానికి ఈ బృందాలు నివేదిక అందచేస్తాయి.

Related posts

రెడ్ ఎలర్ట్: కరీంనగర్ లో కరోనా పాజిటీవ్ కేసు నమోదు

Satyam NEWS

జీతాల చెల్లింపు ప్రక్రియ వేగవంతం చేయాలి

Satyam NEWS

ఏసీబీకి చిక్కిన రామరెడ్డి ఇంచార్జి తహసీల్దార్

Satyam NEWS

Leave a Comment