38.2 C
Hyderabad
April 27, 2024 15: 36 PM
Slider కరీంనగర్

ఎటువంటి అక్రమ లావాదేవీలు జరగలేదు

దర్యాప్తు సంస్థలకు,ప్రభుత్వానికి పూర్తిగా సహకారం అందిస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ,పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లో మంత్రి నివాసంలో జరిగిన ఐటి,ఈడి సంయుక్తంగా చేసిన సోదాలపై మంత్రి గంగుల హైదారాబాద్ విమానాశ్రయంలో స్పందించారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ దర్యాప్తు సంపూర్ణంగా చేయాలని,నిజా నిజాలు తేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదే అని పేర్కొన్నారు. విదేశీ పర్యటనలో ఉన్నపుడే ఈడీ అధికారులకు సోదాలు ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా వీడియోకాల్ చేసి ఇంటి తాళాలు తీయమని చెప్పింది తానే అని వెల్లడించారు.

ఇంట్లోని ప్రతీ లాకర్ నీ ఒపెన్ చేసి చూడమని చెప్పినట్లు తెలిపారు. శ్వేతా గ్రానైట్ అన్ని కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు జరిగినట్లు తెలిపారు.ఐటి,ఈడి సోదాల్లో ఏంత క్యాష్ దొరికిందో, ఏమేం స్వాధీనం చేసుకున్నారో వారే చెప్పాలన్నారు.మైనింగ్, రాయల్టీకి సంబందించిన అంశాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటయన్నారు.బయట దేశాల నుండి డబ్బులు హవాలా తెచ్చామా లేదా అనే విషయాన్ని ఈడి ,డబ్బులు అక్రమంగా నిల్వ ఉంచామో లేదో అనే వివరాలు ఐటి అధికారులు చూసుకుంటారని పేర్కొన్నారు.

ఎటువంటి అక్రమ లావాదేవీలు వారి సంస్థల్లో జరగలేదని అన్నారు.గతంలో సైతం చాలా సార్లు, చాలా మంది, ఈడీ, ఐటీ లకు కంప్లైంట్ చేస్తే కూడా సహకరించినట్లు వెల్లడించారు.పూర్తి పారదర్శకంగా, ప్రభుత్వ అనుమతులతో వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సమయంలో దగ్గరుండి దర్యాప్తుకు సహకరించాలనే ఉద్దేశంతో విదేశీ పర్యటన గించుకొని వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు.

Related posts

అధిక బరువు తూకం వేయడాన్ని నిరసిస్తూ రైతుల ధర్నా

Satyam NEWS

దగ్ధమైన హెయిర్ సెలూన్ షాపు బాధితుడికి ఆర్థిక సహాయం

Satyam NEWS

“30 రోజుల్లో ప్రేమించడం ఎలా” థాంక్స్ మీట్ !!

Satyam NEWS

Leave a Comment