28.7 C
Hyderabad
April 28, 2024 03: 44 AM
Slider తూర్పుగోదావరి

ఆత్మహత్యాయత్నానికి గురైన దళిత విలేఖరికి దక్కని న్యాయం

#dalitreporter

ఐదుగురు విలేకరులు చేసిన అకృత్యాలకు, అవమానాలకు గురైన హెచ్ఎంటీవీ రిపోర్టర్ నాగేంద్ర ఆత్మహత్యాయత్నం చేసినా అతనికి న్యాయం జరగడం లేదు. ఐదుగురు వ్యక్తులతో సహా ఒక ప్రధాన చానల్ రిపోర్టర్ కి అనుకూలంగా లాబీఇంగ్ నిర్వహిస్తూ కొందరు దళారులు వెనకేసుకొస్తున్నారు. గత రాత్రి నియోజకవర్గ ప్రజా ప్రతినిధి వద్ద అర్ధరాత్రి వరకు రాజీ చేయడానికి నాగేంద్ర సంబంధీకులపై ఒత్తిళ్లు నిర్వహించిన వైనం వెల్లడి అయింది.

తన బిడ్డకు జరిగిన అన్యాయం మరి ఎవరికి జరగకూడదు అని నాగేంద్ర తల్లి వాపోతున్నారు. తన కొడుకుకి న్యాయం జరగకపోతే తాను ఆత్మహత్యకు పాల్పడతానంటూ అభాగ్యురాలు ఆక్రోశిస్తున్నారు. పశు మాఫియా, రేషన్ రైస్, అక్రమ రవాణా వాహనాలకు పాసింగ్ నిర్వహిస్తూ, తుని నుండి రాజమండ్రి బోర్డర్ వరకు ఒకరు అక్కడి నుండి జీలుగుమిల్లి వరకు ఈ రిపోర్టర్ లు పాసింగ్ చేసినందుకు వాహనానికి 20 వేలు వసూలు చేస్తుంటారు.

ఈ మధ్య  గంజాయి  రవాణా లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఓ ఛానల్ విలేకరికి కొందరు కొమ్ము కాస్తున్నారు. ప్రధాన ఛానల్ రిపోర్టర్ పై అనేక ఆరోపణలు రుజువైనా సంబంధిత యాజమాన్యం ఏ చర్యలు చేపట్టడం లేదు. కొవ్వూరు గోపాలపురం పోలవరం నియోజకవర్గాలలోని అక్రమ రవాణా దారులతో  బ్లాక్మెయిలింగ్ లతో  కోట్లకు పైగా పడగలెత్తిన ప్రధాన ఛానల్ రిపోర్టర్ బకాసురుడు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Related posts

బ్రాహ్మణులకు జరుగుతున్న అన్యాయాలపై 19 న కార్పొరేషన్ ముట్టడి

Satyam NEWS

భువనగిరి జిల్లా లో మరో పరువు హత్య

Satyam NEWS

జగనన్న తోడుతో చిరు వ్యాపారులకు ప్రోత్సాహం

Satyam NEWS

Leave a Comment