29.7 C
Hyderabad
April 29, 2024 07: 09 AM
Slider విజయనగరం

విజయనగరంలో వినాయ‌క మండ‌పాల‌కు అనుమ‌తి లేదు…!

#deepikapatilias

విజ‌య‌న‌గ‌రం జిల్లాకు కొత్త ఎస్పీ గా దీపికా ఎం.పాటిల్ వ‌చ్చి దాదాపు నెల రోజుల‌పైగా అయ్యింది.ఈ నెల‌న్నర రోజుల్లో త‌న ప‌నిత‌నం ఏంటో అటు శాఖా సిబ్బందికి ఆక‌స్మిక త‌నిఖీల ద్వారా  ప్ర‌త్య‌క్షంగా చూపించారు.

తాజాగా రాబోయే నెల‌లో రానున్న విన‌య‌క‌చ‌వితి సంద‌ర్బంగా బ‌య‌ట పెట్టే మండ‌పాల‌కు చెక్ పెడుతూ…వినాయ‌క చ‌విత‌ని ఎవ‌రి ఇండ్ల‌లో వారే జ‌రుపుకోవాలంటూ సూచ‌న‌లతో పాటు హెచ్చ‌రిక‌ల‌ను కూడా ఎస్పీ జారీ చేసారు. క‌రోనా దృష్ట్యా ప్ర‌జ‌లెవ్వ‌రూ వినాయక  మండపాలు ఏర్పాటు చేయవద్దని చెప్పారు.

సంప్ర‌దాయ‌మైన‌ వినాయక చవితి పండగను కుటుంబ సభ్యులతో ఇళ్ళలోనే జరుపుకుందామ‌ని తద్వారా క‌రోనా మ‌హమ్మారిని నియంత్రిద్దామ‌న్నారు.అలాగే కరోనా  వ్యాప్తి నియంత్రణ దృష్ట్యా వినాయక చవితి సందర్భంగా ప్రజలెవరూ ఒకే చోట గుమికూడి ఉండరాద‌ని హెచ్చ‌రించారు.

క‌రోనా తొలి ద‌శ,రెండో ద‌శ‌లో జిల్లా వ్యాప్తంగా క‌రోనా వైరస్ బారిన పడి మన చుట్టూ ఉన్న ఎంతోమంది ప్రాణాలు కోల్పాయమన్నారు. ప్రజలందరూ ఒకే చోట గుమిగూడటం వ‌ల‌న‌ ఒకరు తాకిన వస్తువులు ఇంకొక‌రు తాకడం వలన క‌రోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందన్నారు.

కావున ప్రజలందరూ ఎవరికి వారుక‌రోనా వైరస్ ను నియంత్రించి మనల్ని, మన శ్రేయోభిలాషుల్ని ఆ వైరస్ నుండి రక్షించేందుకు మన కుటంబసభ్యులతో ఇళ్ళలోనే వినాయక చవితి పండగ జరుపుకోవాల‌న్నారు.

ఇక  వినాయక చవితికి పూజా సామగ్రిని బజారులో వస్తువులు కొనుగోలు చేసేటపుడు వ్యక్తుల మధ్య సోష‌ల్ డిస్ట‌న్స్ తప్పనిసరిగా పాటించాలని, మాస్క్ ను త‌ప్ప‌ని స‌రిగా ధరించాలని మరియు కరోనా నిబంధనలు పాటించాలన్నారు.

క‌రోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ దృష్ట్యా వినాయక చవితికి  బ‌హిరంగంగా ఎవ్వ‌రూ  మండపాలు ఏర్పాటు చేయవద్దని, మండపాలలో అందరూ ఒకే చోట కూడి వినాయక చవితి జరుపుకోవడం వలన క‌రోనా వ్యాప్తి చెందే ప్రమాదముంద‌న్నారు.

అందువ‌ల‌న ఎవ‌రి ఇండ్ల‌లో వారి వారి  కుటుంబ సభ్యులతో వినాయక చవితిని జరుపుకొని,క‌రోనా వైరస్ బారినుండి రక్షణ పొంది క్షేమంగా ఉండాలని ఎస్పీ దీపికా ఎం పాటిల్ కోరారు.

Related posts

కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా

Murali Krishna

ఇష్యూడైవర్ట్:దేశంలో రాడికల్ ముస్లింలు పెట్రేగుతున్నారు

Satyam NEWS

స్వేచ్ఛకు పర్మిషన్ ఇచ్చిన పండుగ దినం

Satyam NEWS

Leave a Comment