29.7 C
Hyderabad
May 6, 2024 03: 25 AM
Slider విశాఖపట్నం

విశాఖలో నిండుకున్న వెంటిలేటర్ బెడ్స్: చోద్యం చూస్తున్న అధికారులు

#ventilaterbed

విశాఖ ENT హాస్పటల్ లో వెంటిలేటర్ బెడ్స్ లేక బెంచ్ పైనే రోగికి ఆక్సిజన్ పెట్టిన హృదయవిదారక సంఘటన ఇది.

గాజువాక పెదనడుపూరు కి చెందిన ఇందల సత్యారావు అనే కరోనా పాజిటివ్ రోగికి శరీరంలోని ఆక్సిజన్ శాతం 54 కి తగ్గడంతో వెంటిలేటర్ తప్పనిసరి అని డాక్టర్లు సూచించారు.

ENT హాస్పటల్ లో వెంటిలేటర్ బెడ్స్ ఖాళీగాలేవని సిబ్బంది సత్యారావు కుమారుడు అప్పలరాజు కి చెప్పగా, జిల్లా లో గల అన్ని ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులకు నిన్నటి సాయంత్రం నుండి రాత్రంతా తిరిగినా ఎక్కడా వెంటిలేటర్ బెడ్స్ దొరకలేదు.

దాంతో వారి బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మంత్రులు ముఖ్య మంత్రి స్పందించి తన తండ్రి కి వెంటనే వెంటిలేటర్ బెడ్ ఏర్పాటు చేసి ప్రాణాలను కాపాడాలని కన్నీరు మున్నీరవుతూ వేడుకుంటున్నారు.

Related posts

వరుణ్ తేజ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం చేసిన అభిమానులు

Satyam NEWS

ములుగు జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు చేయాలి

Satyam NEWS

జిల్లా పాలనలో జగన్ మరో కీలక నిర్ణయం

Satyam NEWS

Leave a Comment