35.2 C
Hyderabad
May 1, 2024 01: 08 AM
Slider విజయనగరం

మీ కోసమే చెబుతున్నాం తల్లీ…కరోన మహమ్మారితో జాగ్రత్త

#vijayanagarampolice

శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని ఏ ఒక్కరూ నిలువరించలేక పోతున్నారు. రోజు రోజుకీ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.

కరోనా కారణంగా మరణాలు పెరుగుతున్నాయి. ఈ నేఫధ్యంలో 18 గంటల పాటు కర్ఫ్యూ అమలులోకి రావడంతో ఆ నిబంధనలు కచ్చితంగా ప్రజలందరూ పాటించేలా పోలీసులు నడుం బిగించారు.

ఈ క్రమంలో ఏపీ రాష్ట్రంలో ని విజయనగరం జిల్లాలో ఇదే నెలలో గతేడాది ఒక్క కేసు రాకుండా చూసిన ఎస్పీ రాజకుమారీ మళ్లీ ఆ వ్యూహాన్నే తన సిబ్బంది చేత అమలు చేయిస్తున్నారు.

మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలవుతున్న..ఆ లోపు బహిరంగ ప్రదేశాలు, రైతు బజార్లు ,కూరగాయలు మార్కెట్లు వద్ద జనాలతో పాటు సరుకుల ను అమ్మే వారికి పోలీసులు చైతన్య పరిచే యత్నాలు చేస్తున్నారు.

ఈ మేరకు జిల్లా కేంద్రంలో ని వన్ టౌన్ ,టూటౌన్ స్టేషన్ సీఐలు మురళీ ,శ్రీనివాస రావులు తమ స్టేషన్ ఎస్ఐ లు కిరణ్ ,దేవీ ,బాలాజీ ,జనార్దన్ లతో ప్రజలను అలెర్ట్ చేయిస్తున్నారు.

ఇందులో భాగంగా నగరంలోని న్యూపూర్ణ జంక్షన్ వద్ద టూటౌన్ సీఐ శ్రీనివాసరావు తన సిబ్బంది తో కూరగాయలు అమ్మే వారికి కరోనా మహమ్మారి పట్ల అవగాహనతో పాటు మున్సిపల్ శానిటరీ ఇన్ స్పెక్టర్ సహాయం తో రోడ్లపై సర్కిల్స్ వేయించారు.

అటు వన్ టౌన్ స్టేషన్ ఎస్ఐ దేవీ కూడా కరోనా పట్ల ప్రజలను చైతన్య పరుస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం తీసుకుంటున్న చర్యలలో భాగంగా జిల్లా ఎస్పీ రాజకుమారి ఆదేశాలు మేరకు వివిధ పోలీస్ స్టేషన్లు పరిధిలోని మార్కెట్ ప్రదేశాలలో పోలీసు అధికారులు, సిబ్బందిని ప్రజలను హెచ్చరించారు.

కూరగాయలు, పండ్లు, చేపలు దుకాణాలుకు మరియు నిత్యావరాలను నిమిత్తం వచ్చే ప్రజలు గుంపులుగా ఉండకుండా  సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా కరోనా నియమాలను పాటిస్తూ, కరోనా వైరస్ పట్లా జాగ్రతలు తీసుకోనే విధముగా  ప్రజలకు అవగాహన కల్పించారు.

Related posts

ఆర్ఫన్ డాడీ: కన్నావు, పెంచావు..ఇక నీతో మాకేం పని?

Satyam NEWS

శ్రీశైలంలో వైభవంగా కుంభోత్సవ వేడుకలు

Satyam NEWS

ఒక్క స్నాప్  తో ఘ‌ట‌నా స్థ‌లికి పోలీసులు….!ఎక్క‌డంటే…?

Satyam NEWS

Leave a Comment