31.7 C
Hyderabad
May 2, 2024 08: 25 AM
Slider వరంగల్

నీళ్లు లేక హనుమాన్ భక్తుల అవస్థలు

#hanumantemple

ములుగు మండలం లోని ఇంచర్ల గ్రామా పరిధి లోని రామస్వామి గుట్ట వద్ద కల హనుమాన్ గుడి వద్ద ఉన్న బోరింగ్ పనిచేయక పోవటం తో హనుమాన్ దీక్ష తీసుకున్న భక్తులకు తీవ్ర ఇబ్బంది అవుతుందని స్వాములు ఆరోపిస్తున్నారు. దీక్ష స్వాములు మాట్లాడుతూ హనుమాన్ గుడి దగ్గర ఉన్న బోరింగ్ పాడైపోయి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా పాలక వర్గం పట్టించుకోవటం లేదని, ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్ మార్గం నీటితో నిలవటం వలన స్వాములు కాలి నడకన వెళ్ళటం జరుగుతుందని, నడక దారిలో విషపూరిత కీటకాలు ఎదురవుతున్నాయని అన్నారు.

గత రెండు సంవత్సరాల నుండి శ్రీరామ నవమి వేడుకలు ఒక్కరోజు డ్రమ్ముల ద్వారా నీరు తెప్పించటం, జెనెరేటర్ ద్వారా కరెంట్ సప్లై చేసి ఒక్కరోజు కార్యక్రమాన్ని నిర్వహించి, మళ్లీ వచ్చే శ్రీరామ నవమి వరకు ఇక్కడి గుడిని ఏ మాత్రం పట్టించుకోవటం లేదని స్వాములు అంటున్నారు. హనుమాన్ దీక్ష అంటే ప్రతి రోజు ఉదయం, సాయంత్రం గుడిని కడుగవలసి ఉంటుందని, కనీసం కాళ్ళు కడుక్కోవటానికి కూడా నీళ్లు లేక దగ్గరలో ఉన్న పోచమ్మ గుడి దగ్గరికి వెళ్ళటం అవుతుందని, చీకటిలో నీళ్ల కోసం చాల అవస్థలు పడుతున్నామని తెలిపారు.

కరెంట్ సౌకర్యం లేక మొబైల్స్ లైట్ వెలుగులో పూజలు నిర్వహించటం జరుగుతుందని స్వాములు అంటున్నారు. గత రెండు సంవత్సరాలుగా కల్యాణానికి వచ్చిన విరాళాలు పాలక వర్గం దగ్గర ఉన్నాయని, శ్రీరామ నవమి ఒక్కరోజు మాత్రం ఈ గుడి మాది అని, తర్వాత గుడిని ఒక రోజు కూడా ఎవరైనా వచ్చి పట్టించుకున్నవారే వారే లేరని అన్నారు. దీక్ష స్వాములు కాకుండా ప్రతి మంగళవారం శనివారం దర్శించుకునే భక్తులకి కూడా నీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని ఇప్పటికైనా సంబంధిత కమిటీ సభ్యులు చొరవ తీసుకొని సాధ్యమైనంత త్వరగా విద్యుత్ సౌకర్యం, నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలనీ వారు కోరారు.

Related posts

కేంద్ర ఆర్ధికమంత్రి బడ్జెట్ ఆశా జనకం

Satyam NEWS

స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో రాజేష్ టచ్‌రివర్ ‘దహిణి’

Bhavani

వైసీపీ కక్ష సాధింపునకు నిదర్శనం కొల్లు రవీంద్ర అరెస్ట్

Satyam NEWS

Leave a Comment