40.2 C
Hyderabad
April 28, 2024 15: 15 PM
Slider ప్రత్యేకం

ఆంధ్రాకు వచ్చేస్తే షర్మిల పార్టీ సూపర్ హిట్టు

#raghurama

చనిపోయిన వ్యక్తి తిరిగివచ్చి  తనని తాను సమర్ధించుకోలేడని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారా అంటూ వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు  రఘురామకృష్ణంరాజు తెలిపారు. గురువారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వైఎస్ వివేకానంద రెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న  సాక్షి దినపత్రిక, ఛానల్ పై ఆమె పరోక్షంగా మండిపడ్డారు. ఎక్కడో ఉన్న షేక్ షమీం  ను బయటకు తీసుకొచ్చి వైఎస్ షేక్ షమీం రెడ్డి గా మార్చారు.

ఆమె బహాటంగా మాట్లాడింది లేదు. అయినా, కేసు వేస్తుంది అంటూ తప్పుడు ప్రచారాన్ని చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు లచ్చమ్మ కుటుంబ సభ్యుల పైకి రాకుండా ఉండేందుకే ఇదంతా చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు,  షర్మిల దీటైన వ్యాఖ్యలను చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి తన యావత్ ఆస్తిని  తన కూతురు, మనవడు మనవరాలు పేరిట రాశారు. ఆస్తి కోసమే హత్య అయితే, డాక్టర్ సునీతను  రాజశేఖర్ రెడ్డి హత్య చేయాలి. కానీ వైఎస్ వివేకానంద రెడ్డిని  డాక్టర్ సునీత, రాజశేఖర్ రెడ్డి హత్య చేశారని  పేర్కొనడం ఇదేమి సంస్కారం అంటూ షర్మిల మండిపడ్డారని వెల్లడించారు. షర్మిల  తన పార్టీ పేరును వైయస్సార్ తెలుగు పార్టీ గా మార్చుకొని ఆంధ్రాలోనూ కార్యకలాపాలను  చేపట్టాలని స్థానికులు కోరుతున్నారని ఆయన వెల్లడించారు.

ఐదవ తేదీ లోపు  లొంగిపోవాలని గంగిరెడ్డి కి ఆదేశం

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో  నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న  ఎర్ర గంగిరెడ్డి బెయిలు రద్దు చేస్తూ హైకోర్టు కోర్టు తీర్పును ఇచ్చింది. మే నెల 5వ తేదీ లోపు కోర్టులో లొంగి పోవాలని ఆదేశించిందని రఘు రామ కృష్ణంరాజు తెలియజేశారు. జూన్ 30వ తేదీ నాటికి  చార్జిషీట్ దాఖలు చేయాలని  సిబిఐ ని  సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో డిఫాల్ట్ బెయిల్  ఇవ్వవచ్చునని  హైకోర్టు పేర్కొన్నట్లుగా  మీడియాలో కథనాలు వచ్చాయి. డిఫాల్ట్ బెయిల్ అని ఎందుకు సంబోధించారో హైకోర్టు తీర్పు పూర్తి పాఠం అందితే కానీ చెప్పలేం.

సిబిఐ ఉదాసీనత వహించిన ఝాన్సీ లక్ష్మీబాయి లాగా న్యాయపోరాటం చేస్తున్న డాక్టర్ వైఎస్ సునీత ఊరుకుంటుందా ?, ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు ద్వారా ఒక విధంగా సిబిఐ విజయం సాధించినట్లుగానే చెప్పాలి. వైఎస్ వివేకానంద రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి ఇంటికి  సిబిఐ అధికారులు వెళ్ళగా, ఆయన అందుబాటులో లేనట్టు తెలిసింది. సిబిఐ అధికారులు వస్తున్నారని తెలిసే పారిపోయారా?, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన మార్చి 14వ తేదీ, ఆ మరుసటి రోజు 15వ తేదీ కూడా గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి యురేనియం కార్పొరేషన్ లో విధులకు హాజరు కాలేదు.

15వ తేదీ మాత్రం  విధులకు హాజరైనట్లుగా  తప్పుడు  హాజరీని సృష్టించే ప్రయత్నాన్ని చేశాడు. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి జయప్రకాశ్ రెడ్డి   వైయస్ భారతి రెడ్డి తండ్రి ఈసీ గంగిరెడ్డి కి  సమీప బంధువు. ఇద్దరిదీ ఒకే గ్రామం. ఈసీ గంగిరెడ్డి అభ్యర్థన మేరకే, ఎంపీగా కొనసాగుతున్న సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి  యురేనియం కార్పొరేషన్  లో ఉద్యోగాన్ని ఇప్పించారని రఘు రామకృష్ణంరాజు తెలియజేశారు.

హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరి చేస్తే, సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించే ఛాన్స్

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరీ చేస్తే, ఈనెల 18వ తేదీ వరకు సుప్రీం కోర్టు పనిచేస్తుండడం వల్ల సిబిఐ, సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయని రఘురామకృష్ణంరాజు తెలియజేశారు. వైయస్ అవినాష్ రెడ్డికి  హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరి చేస్తుందని తాను భావించడం లేదు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు నేపథ్యంలో, వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సాక్షిగా  పిలువబడి అనుమానితుడిగా పేర్కొన్న వైఎస్ అవినాష్ రెడ్డి ని  ఇప్పుడు నిందితుడిగా చేర్చారు.

రేపు హైకోర్టులో తీర్పు  ఏటయినా కావచ్చు… రావచ్చు.  వైయస్ అవినాష్ రెడ్డికి జైలా… బెయిలా? గత మూడు రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. అసెంబ్లీలో తనను లుచ్చా అని సంబోధించిన లుచ్చాకు జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. అసెంబ్లీలో మంచి పిల్లవాడని జగన్మోహన్ రెడ్డి సంబోధించిన  అవినాష్ రెడ్డి  అరెస్ట్ తద్యమని ప్రొద్దుటూరు  ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అరెస్టు అయితే ఏమవుతుంది, బెయిల్ వస్తుందని ఆయనే పేర్కొన్నారు. కానీ ఈ హత్య కేసులో  జూన్ 30 తరవాతే  బెయిల్ ఇస్తారనే విషయాన్నీ ఆయన గ్రహించడం లేదు. వైఎస్ అవినాష్ రెడ్డి నేరస్తుడని  రుజువైతేనే  తాను రాజీనామా చేస్తానని పేర్కొన్నట్లుగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మాట మార్చారన్నారు.

హత్య జరిగిన తెల్లారి 10:30 వరకు  సాక్షిలో గుండెపోటు కథ ఎందుకు నడిపించారు?

వైఎస్ వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేసి, హత్య జరిగిన మరుసటి రోజు  ఉదయం 10:30 గంటల వరకు  సాక్షి ఛానల్  లో గుండెపోటు కథను ఎందుకు నడిపించారని  రఘు రామకృష్ణంరాజు ప్రశ్నించారు. వైఎస్ వివేకానంద రెడ్డి చేత ఆయన బ్రతికి ఉండగానే బలవంతంగా బెడ్ రూమ్ లో లేఖ రాయించారు. లేఖ రాస్తే, వదిలి వేస్తామని హంతకులు  చెప్పి ఉంటారు. ప్రసాద్ అనే వ్యక్తి ఒకవేళ  హత్యలో పాల్గొని ఉండి ఉంటే,   ఆయన తన పేరిట వైఎస్ వివేకానంద రెడ్డి చేత లేఖ రాయించుకునే అవకాశం లేదు. ఈ చిన్న లాజిక్ వైయస్ అవినాష్ రెడ్డి ఎలా మిస్ అయ్యారు.

ఈ విషయంలో  రాజశేఖర్ రెడ్డి మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహరించారు. వైఎస్ వివేకానంద రెడ్డి రాసిన లేఖ గురించి పదేపదే మాట్లాడుతున్న వారు. కుట్లు వేసి,  కట్లు ఎందుకు కట్టారు. వైఎస్ వివేకానంద రెడ్డి  బెడ్ రూమ్, బాతు రూములలో  రక్తపు మరకలను ఎందుకు తుడిచారు. రక్తపు వాంతులు చేసుకుని చనిపోయాడని    ఎందుకు ప్రచారం చేశారు. ఈ ప్రశ్నలన్నింటికీ  సాక్షి దినపత్రిక  ఎందుకు సమాధానం చెప్పడం లేదు. రాష్ట్రంలో వాక్ స్వాతంత్రం లేదు కాబట్టి ప్రజలెవరూ మాట్లాడడం  లేదు. ఇంకా ఈ విషయంలో ఎక్కువగా మాట్లాడితే పార్టీ పరువే పోతుందని  పార్టీ నాయకత్వం గ్రహించాలని రఘురామకృష్ణం రాజు సూచించారు.

Related posts

పేట మార్కెట్ యార్డు చైర్మన్ గా అబ్దుల్ హనీఫ్

Satyam NEWS

ప్రముఖ నటుడు బాలయ్య మృతి

Satyam NEWS

హుజురాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు మత్స్య సంఘం మద్దతు

Satyam NEWS

Leave a Comment