29.7 C
Hyderabad
May 2, 2024 05: 15 AM
Slider విజయనగరం

కేంద్ర ఆర్ధికమంత్రి బడ్జెట్ ఆశా జనకం

#kolagatla

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్  అన్ని వర్గాలకు ఉపయోగపడే బడ్జెట్ గా ఉందని, మరోవైపు  ఎన్నికల బడ్జెట్ గా కూడా  కనపడుతోందని  రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి తెలిపారు. బడ్జెట్ పై డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. కేవలం 7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఊరట కల్పించింది ఈ కేంద్ర బడ్జెట్ అని, రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు నైపుణ్య శిక్షణ కళాశాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలపడం అభినందనీయమని అన్నారు. ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి 47 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు 653 కోట్లు కేటాయించడం శుభ పరిణామం అన్నారు.  రాజకీయ ప్రయోజనాల కోసం రూపుదిద్దుకున్న బడ్జెట్గా కనబడుతోంది. మరోవైపు ప్రక్కన కర్ణాటకకు భారీ కేటాయింపులు చేయడం , తెలుగు రాష్ట్రాలకు అంతగా కేటాయింపులు చేయకపోవడం జరిగిందన్నారు.  వ్యవసాయం, మౌలిక వసతులు రంగానికి పెద్దపీట వేయడం జరిగిందనీ అయితే రాష్ట్రానికి సంబంధించి విభజన చట్టంలోని హామీల విషయం కానీ, ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించకపోవడం, రైల్వే కారిడారిపై ఎలాంటి హామీ ప్రస్తావన లేకపోవడం  సరికాదన్నారు. ఏపీకి సంబంధించి బడ్జెట్లో  కేటాయింపులు అర కొరగానే ఉన్నాయి అని అన్నారు.

Related posts

ఉప శాఖల పంచాయితీ: ప్రజా ధనం వృధా

Bhavani

జర్నలిస్టుల పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

సక్సెస్ బాటలో బైలంపుడి

Satyam NEWS

Leave a Comment