26.2 C
Hyderabad
December 11, 2024 20: 49 PM
Slider ప్రత్యేకం

సాక్షి ఉద్యోగికి సలహాదారుడి పదవి

#jaganmohan

సార్వత్రిక ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగబోతున్నా..సలహాదారులను నియమించడంలో జగన్‌ ప్రభుత్వం ఏ మాత్రం మొహమాటం పడడం లేదు. రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరుగుతున్నా..ప్రభుత్వం మాత్రం తనకు కావాల్సిన వారికి ఇంకా పదవులను పందేరం చేస్తూనే ఉంది. బోలెడంత మంది సలహాదారులు ఉన్నా..వారు చాలడం లేదని కొత్త కొత్త వారిని వెతికి మరీ సలహాదారుల పదవులను ఇస్తోంది.

తాజాగా ‘సాక్షి’ టివీ మేనేజింగ్‌ ఎడిటర్‌గా ఉన్న నేమాని భాస్కర్‌కు పబ్లిక్‌ పాలసీ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఎన్నికల ముందు ప్రభుత్వం నియమిస్తోన్న సలహాదారుల పదవులపై ఇప్పటికే రాజకీయంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన సలహాదారులు మంత్రి మండలి కన్నా ఎక్కువ ఉందని, వారు ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు ఏమిటో చెప్పాలని ప్రతిపక్ష టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు వచ్చినా..వాటిని లెక్కపెట్టకుండా తనకు కావాల్సిన వారికి సలహాదారుల పదవులను కట్టబెడుతోంది జగన్‌ ప్రభుత్వం. తాజాగా సలహాదారుగా నియమితులైన నేమాని భాస్కర్‌ గతంలో ‘ఆంధ్రభూమి, ‘సాక్షి’ దినపత్రికల్లో పనిచేశారు. ఆ తరువాత ‘ఎన్‌టివి, ప్రస్తుతం ‘సాక్షి’ టివీల్లో పనిచేస్తున్నారు.

Related posts

28 లక్షల తో కంటోన్మెంట్ స్విమ్మింగ్ పూల్ ఆధునికీకరణ…!

Satyam NEWS

నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి

Murali Krishna

భాగ్యనగర్ యువకులారా…. మజ్లిస్ సవాల్ ను స్వీకరించండి

Satyam NEWS

Leave a Comment