35.2 C
Hyderabad
April 27, 2024 14: 09 PM
Slider సంపాదకీయం

నిధుల కోసం కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు

#rahulgandhi

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేం కానీ కాంగ్రెస్ పార్టీ తాజాగా చేపట్టిన క్రౌడ్ ఫండింగ్ మాత్రం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. 138 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి నిధుల సమస్య వెంటాడుతోంది. అత్యధిక కాలం అంటే.. ఆరేడుదశాబ్దాల పాటు కేంద్రంలో ..రాష్ట్రాల్లో చక్రం తిప్పిన ఆ పార్టీకి పట్టుమని ఐదు వందల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు.

అదే సమయంలో కార్పొరేట్ విరాళాలు తగ్గిపోయాయి. బీజేపీ వచ్చిన తర్వాత గత పదేళ్ల కాలంలో ఆ పార్టీకి నిర్వహణకు అవసరమైన మొత్తం కూడా సమకూరడంలేదు. కార్పొరేట్ విరాళాల్లో 90 శాతం బీజేపీకే వెళ్తున్నాయి. బీజేపీకి ఇచ్చే పద్దతి వేరుగా ఉంటుంది. బీజేపీతో కాంగ్రెస్ కు కూడా ఇచ్చే వాతావరణం లేదు. కాంగ్రెస్ కు విరాళం ఇస్తున్నారని తెలిస్తే ఆ కార్పొరేట్ సంస్థలకు గడ్డు పరిస్థితి ఎదురవుతుంది.

అందుకే ఎవరూ రిస్క్ తీసుకోవడం లేదు. పైగా బీజేపీ రాగానే ఎలక్టోరల్ బాండ్లను తీసుకు వచ్చింది. ఇది బీజేపీ కోసమే అన్నట్లుగా మారింది. 90 శాతానికిపైగా ఎలక్టోరల్ బాండ్లు బీజేపీ ఖాతాలో పడుతున్నాయి. కొన్ని ప్రాంతీయ పార్టీల కన్నా ఘోరంగా కాంగ్రెస్ పార్టీకి విరాళాలు తగ్గిపోయాయి. అనేక రాష్ట్రాల్లో అధికారం కూడా లేకపోవడంతో విరాళాలు ఇచ్చే వారూ తగ్గిపోయారు.

పార్టీ ఖర్చులు చూసుకునే నేతలు కూడా లేకుండా పోయారు. చివరికి పార్టీకి విరాళాలివ్వాలని ప్రజల్ని కోరుతూ.. ఓ ఉద్యమాన్ని ప్రారంభించింది. 138 రూపాయలు లేదా..1380 లేదా .., 13800 ఎంతైనా ఇవ్వొచ్చని ప్రజల్ని కోరుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఓ రకంగా ఇది ఆర్థిక సమస్యలను కొంతైనా తీర్చే అవకాశం ఉంది. అదే సమయంలో సామాన్యుల నుంచి వచ్చే స్పందనను బట్టి… త మపార్టీకి ఉన్న ఆదరణను అంచనా వేసుకుంటారు.

ఈ విధానంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ప్రజల్ని మభ్య పెడుతున్నారని విమర్శిస్తోంది. కానీ ఆ పార్టీ ఖాతాలో ఇప్పటికిప్పుడు నగదు ఐదారు వేల కోట్లు ఉంది. ఆ పార్టీకి హాయిగానే ఉంటుదన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇలా నిధులు సేకరించడం వల్ల రెండు రకాలుగా పార్టీకి మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

తమకు నిధులు ఇచ్చిన వారు తాము అధికారంలోకి రావాలని కోరుకుంటారని, అందువల్ల తమ బేస్ పెరిగినట్లేనని వారు అనుకుంటున్నారు. అందుకోసమే దేశవ్యాప్తంగా నాయకులందరిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది.

Related posts

మేడారం జాతర కోసం పకడ్బందిగా పార్కింగ్ ఏర్పాట్లు

Satyam NEWS

ఆహా యాప్ లో విడుదల అయిన నవీన్ చిత్రం

Satyam NEWS

రైతు మెడపై వేలాడుతూనే ఉన్న ‘కొత్త చట్టం కత్తి’

Satyam NEWS

Leave a Comment