40.2 C
Hyderabad
April 29, 2024 15: 18 PM
Slider ప్రపంచం

మళ్లీ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

#northkorea

ఉత్తర కొరియా మళ్లీ దక్షిణ కొరియా వైపు క్షిపణులను ప్రయోగించింది. ఈ నేపథ్యంలో రెండు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యోల్ జాతీయ భద్రతా మండలి సమావేశంలో ఈ విషయంపై చర్చ జరపాలని పిలుపునిచ్చారు. ఉల్లుంగ్డో ద్వీపంలోని ప్రజలను సమీపంలోని బంకర్లకు తరలించాలని, ఎదురుదాడికి సైన్యం తక్షణమే సంసిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఉత్తర కొరియా వైఖరి ఇటీవలి సంవత్సరాలలో అత్యంత దూకుడుగా ఉంది.

ఉత్తర కొరియా సైనిక పాలకుడు కిమ్ జాంగ్ ఉన్ ఆదేశాల మేరకు బుధవారం బాలిస్టిక్ క్షిపణులతో సహా 10 క్షిపణులను ప్రయోగించారు. దక్షిణ కొరియా సైన్యం మొదటిసారిగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించింది. ఉల్లెంగ్డో ద్వీపంపై వైమానిక దాడుల హెచ్చరిక జారీ చేసినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (జేసీఎస్) తెలిపారు. ఉత్తర కొరియా చేసిన ఈ క్షిపణి దాడి ఇటీవలి సంవత్సరాలలో అత్యంత దూకుడుగానూ, రెచ్చగొట్టేదిగా దక్షిణ కొరియా సైన్యం అభివర్ణించింది. సముద్ర సరిహద్దులు, ఇతర విషయాలపై ఇరు దేశాల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. వివాదాస్పద ప్రాంతంలో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు సమాచారం.

జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ డైరెక్టర్, కాంగ్ షిన్-చుల్ మాట్లాడుతూ, ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం చాలా అసాధారణమైనదని, అది తమకు ఎట్టిపరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని ప్రకటించారు. కొరియా విభజన తర్వాత ఉత్తర సరిహద్దు రేఖకు దక్షిణంగా దక్షిణ కొరియా జలాల సమీపంలో క్షిపణిని ప్రయోగించడం ఇదే తొలిసారి. తూర్పు సముద్రం వైపు ఉత్తర కొరియా మూడు స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని ఆయన చెప్పారు. ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాన్ని జపాన్ కూడా ధృవీకరించింది.

దీంతో పాటు కోస్ట్‌గార్డ్‌ను అప్రమత్తంగా ఉండాలని కోరారు. కొరియా ద్వీపకల్పంలో పెరుగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా వీలైనంత త్వరగా జాతీయ భద్రతా సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నామని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా తెలిపారు. దక్షిణ కొరియా మరియు అమెరికా సంయుక్తంగా నిర్వహించనున్న అతిపెద్ద ఉమ్మడి వైమానిక విన్యాసాల మధ్య కిమ్ జోంగ్ ఉన్ ఈ క్షిపణిని ప్రయోగించారు.

Related posts

(Natural) Cbd Oil Lexington Ky Hemp Cbd Moisturizing Lotion For Hydration

Bhavani

తిరుమల తిరుపతి పాలకమండలి పై తాజా నిర్ణయం

Satyam NEWS

మంత్రులు ఎమ్మెల్యేలలాగా చేతులు కట్టుకుని నిలబడం

Satyam NEWS

1 comment

Madhavi November 2, 2022 at 1:19 PM

Satyam news giving regular updates over international developments. Keep it up.

Reply

Leave a Comment