టీటీడీ పాలకవర్గ సభ్యుల సంఖ్యను ప్రభుత్వం కుదించనుంది. గతంలో చైర్మన్ సహా 15 మంది సభ్యులుగా ఉండేవారు. ఆ సంఖ్యను ప్రభుత్వం 25 కి పెంచనుందన్న వార్తలు వచ్చాయి. ఆ తరువాత తిరుపతి ఎంపీ, ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్లను కూడా సభ్యులుగా నియమించాలని ప్రభుత్వం యోచించింది. దీంతో పాలకవర్గ సభ్యుల సంఖ్య 32కి చేరుతుందని భావించారు. ఇంత మందిని నియమించడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఆ సంఖ్యను తగ్గించనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో టీటీడీ పాలకవర్గంలో 29 మంది సభ్యులుగా ఉండనున్నారు. చైర్మన్ సహా 25 మంది సభ్యులు, నలుగురు ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి 29 మంది బోర్డు సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు న్యాయశాఖ ఆర్డినెన్స్‌ను రూపొందించి గవర్నర్ ఆమోదానికి పంపినట్లు సమాచారం. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది
previous post