29.7 C
Hyderabad
May 3, 2024 06: 12 AM
Slider నల్గొండ

నవంబర్ 26 దేశవ్యాప్త సమ్మె

citu Huzurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇందిరా భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆల్ ట్రేడ్ యూనియన్ సదస్సు ఐఎన్‌టీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య, సీఐటీయూ నాయకుడు ఎలక సోమయ్య గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆల్ ట్రేడ్ యూనియన్ నాయకులు రాష్ట్ర ఐఎన్టీయూసీ ప్ర‌ధాన కార్యదర్శి యరగాని నాగన్నగౌడ్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరి రావు, శీతల రోషపతి, ఏ ఐ టి యు సి జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్, ఐ పి టి యు జిల్లా నాయకుడు మేకల నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా అన్ని కార్మిక సంఘాలు ఈ నెల 26న, విధిగా సమ్మెలో పాల్గొని బిజెపి నిరంకుశ పాలనను ఖండించాల‌న్నారు.

ఇటీవల సవరించిన కార్మిక చట్టాలను కార్మిక సంఘాల సెంట్రల్ ప్రతినిధుల ద్వారా మళ్లీ చర్చ చేయాలని, లేకుంటే కార్మిక వర్గాలు మున్ముందు ప్రత్యక్ష కార్యాచరణలు చేపడతాయని అన్నారు. అదే విధంగా వ్యవసాయ బిల్లును కూడా పునః సమీక్షించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టి ఆర్ ఎస్ కె వి నాయకుడు పచ్చిపాల ఉపేందర్, టి ఎన్ టి యూ సి నాయకుడు తండు సాయిరాం గౌడ్, ఐ ఎన్ టి యు సి నాయకుడు సలిగంటి జానయ్య, గుండెబోయిన వెంకన్న, ఐ ఎఫ్ టి యు అజయ్, గురవయ్య, చప్పిడి సావిత్రి, పోతనబోయిన రామ్మూర్తి, గడ్డం వెంకటమ్మ, మస్తాన్ రాజు, ఇందిరా వెంకటేశ్వర్లు, శివపార్వతి, రవి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ వాహనానికి ప్రమాదం

Satyam NEWS

మురుగనీరు వస్తున్నా పట్టించుకోని మునిసిపల్ అధికారులు

Satyam NEWS

పెండింగ్ పనులపైనే నా దృష్టి…!

Satyam NEWS

Leave a Comment