40.2 C
Hyderabad
April 29, 2024 17: 50 PM
Slider గుంటూరు

మురుగనీరు వస్తున్నా పట్టించుకోని మునిసిపల్ అధికారులు

#mim

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం లో గత 15 రోజుల నుంచి రంగు మారి, దుర్వాసన తో కూడిన నీళ్లు సరఫరా అవుతుంటే పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని ఎంఐఎం పార్టీ రాష్ట్ర నాయకుడు మస్తాన్ వలి అన్నారు. మంచినీటి పైపుల ద్వారా మురుగునీటిని సరఫరా చేస్తున్న మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిరసన గా నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం ముందు నేడు ఎంఐఎం పార్టీ తరపున నిరసన తెలిపారు.

అనంతరం మున్సిపల్ కమిషనర్ కి ఈ మేరకు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నాయకులతో బాటు అమరావతి రజక ఐక్యవేదిక నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మస్తాన్ వలి మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు ముందు చూపు లేకుండా వచ్చేది వేసవి కాలం అని తెలుసుకోకుండా నాగార్జున సాగర్ కాలువ ద్వారా నీటి లభ్యత ఉండదు కాబట్టి చెరువు నీళ్లు శుద్ధి చేసి సప్లై చేయాలి అనేది లేకుండా నిర్లక్ష్యం వహించారని అన్నారు.

ఈరోజు పట్టణ ప్రజలకు మంచి నీటి కష్టాలు తెచ్చారు అని అన్నారు అదే కాకుండా ముస్లింలు పవిత్ర రంజాన్ నెల లో దుర్వాసన తో వచ్చే మంచినీటి త్రాగలేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దౌర్భాగ్యం నరసరావుపేట లో ఎప్పుడు చూడలేదు అని తెలిపారు. ఇప్పటికైనా స్వేచ్ఛమైన మంచినీటిని సప్లై చేసే ప్రజల ఆరోగ్యన్నా కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

అలాగే పట్టణం లో వున్న ముస్లిం సహోదరులు పవిత్ర రంజాన్ పండుగ నాడు ఈద్గా మైదానం లో నవాజ్ కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈద్గా మైదానం శుభ్రం చేయాలనీ మున్సిపల్ కమిషనర్ ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ రాష్ట్ర నాయకులు మస్తాన్ వలి అమరావతి రజక ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఉదయగిరి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Related posts

హుజురాబాద్ లో మోడీ ఫోటో దాచిపెట్టి ఈటల ప్రచారం

Satyam NEWS

కంప్లయింట్: ఏం కొనేట్టు లేదు ఏం తినేట్టు లేదు

Satyam NEWS

1.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారoభo

Bhavani

Leave a Comment