26.7 C
Hyderabad
April 27, 2024 08: 55 AM
Slider నెల్లూరు

ఎన్ఎస్ఎస్‌ వాలంటీర్ అవార్డుకు వీఎస్యూ విద్యార్థి ఎంపిక‌

Student

సమాజ సేవా కార్యక్రమాలలో నిబద్దత కలిగి సంఘ సేవ చేసి అలాగే వివిధ NSS కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నవాలంటీర్లకు ప్రతి ఏటా 9 మందికి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ వాలంటీర్ అవార్డు అంద‌జేస్తారు. 2019-2020కి గాను ఈ అవార్డును విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలలో తృతీయ సంవ‌త్స‌ర విద్యార్థి చుక్కల పార్థసారథి ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

సుమారు రెండు లక్షల యాభైవేల మంది వాలంటీర్లు వున్నఆంధ్ర రాష్ట్రంలో తొమ్మిది మందిలో ఒకరుగా ఎంపిక అవ్వటం ఒక గొప్ప విషయం అని ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు అన్నారు. పార్థసారధిని ఆయన అభినందించారు. రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి నిబద్దతో కష్టపడే వారి కష్టానికి గుర్తింపు ఉంటుందని అందుకు పార్థసారథికి ఈ అవార్డు దక్కటం చక్కని నిదర్శనమని తెలిపారు.

కోవిడ్ నేప‌థ్యంలో పార్ధసారధి ఎన్నోరకాల సేవా కార్యక్రమాలు చేపట్టాడని అన్నారు. ఈ సందర్భంగా చుక్కల పార్థసారధిని రెక్టార్ ఆచార్య యం చంద్రయ్య రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి, NSS సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం కృష్ణ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం పి కృష్ణారెడ్డి , పి. చంద్ర శేఖర్ రెడ్డిలు అభినందించారు.

Related posts

కాణిపాకం దేవాలయ చైర్మన్ పదవి దక్కేదెవరికి?

Satyam NEWS

ఇంటి వద్దకే రేషన్ బియ్యం పంపిణీ…!

Sub Editor

పశ్చిమ బెంగాల్‌లో దిశ తరహాలోనే మరో అకృత్యం

Satyam NEWS

Leave a Comment