31.7 C
Hyderabad
May 2, 2024 07: 07 AM
Slider కడప

కంటతడి పెట్టించే కరోనా మృతుడు ఎన్టీవీ మధు ఆడియో

#NTV Reporter Madhu

తనకు కరోనా సోకిందని కడప పాతిమా కాలేజీ లో వైద్య సిబ్బంది స్పందించ లేదని తనకు ఆయాసం వస్తోందని,తన ప్రాణాలకు హాని జరిగితే పాతిమా కాలేజీ సిబ్బంది దే బాధ్యత అని ఆడియో విడుదల చేసి మూడో రోజు కడప జిల్లా మీడియా మిత్రుడు ఎన్టీవీ రిపోర్టర్ మధుసూదన్ రెడ్డి కరోనా పాజిటివ్ తో తిరుపతి లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

మధుసూదన్ రెడ్డి ఐ న్యూస్, ఎన్టీవీ రిపోర్టర్ గా, జిల్లా ఇంచార్జీ అందరికి సుపరిచితులు. పాతిమా కాలేజీ లో వైద్య సిబ్బంది స్పందించ లేదని తనకు ఆయాసం వస్తోందని,తన ప్రాణాలకు హాని జరిగితే పాతిమా కాలేజీ సిబ్బంది దే బాధ్యత అని మధు మూడు రోజుల క్రితమే ఆడియో విడుదల చేసారు.

దీనితో జిల్లా అంతటా కలకలం రేగి జర్నలిస్టులు అధికారులపై ఒత్తిడి పెంచారు. దీనితో తూతూ మంత్రం పరీక్షలు నిర్వహించి అదే రోజు తిరుపతి కి తరలించారు. శుక్రవారం ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీనితో తోటి జర్నలిస్టులు, మిత్రులు శోక సంద్రం లో మునిగిపోయారు.

అధికారుల నిర్లక్ష్యం తో జర్నలిస్టు మిత్రుడు మధు అన్న ను కోల్పోయా మని ఇది చాలా బాధాకరమైన విషయమని మధు చావుకు కారకులైన కడప ఫాతిమా కాలేజీ క్వా రైటెన్ సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకొని,మధు కుటుంబాన్ని ఆదుకోవాలని కడప జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు డిమాండ్ చేశారు.

Related posts

Good News: 23 నుంచి మళ్లీ రిజిస్ట్రేషన్లు షురూ

Satyam NEWS

ఏ అధికారంతో అంబులెన్స్‌లు ఆపారు?

Satyam NEWS

ఉప్పెనలా వచ్చిన ఉద్యోగులు..చేతులెత్తేసిన పోలీసులు

Satyam NEWS

Leave a Comment