28.7 C
Hyderabad
April 26, 2024 08: 00 AM
Slider నల్గొండ

కరోనా కట్టడికి అందరూ కలసి రావాలి

#Maha Cement

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్లచెరువు మండల కేంద్రంలో కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు కనిపించడంతో  ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో లాక్ డౌన్ చేయాలంటూ గ్రామ సర్పంచ్ పందిళ్లపల్లి శంకర్ రెడ్డి తెలియజేశారు.

రెండు రోజుల క్రితం మేళ్లచెరువు గ్రామంలో ఒకరికి కరోనా వ్యాధి లక్షణాలు కనిపించడంతో ఆ వ్యక్తి హైదరాబాదులో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని, ఆ వ్యక్తి నివసించిన నివాస ప్రాంతాన్ని కట్టడి ప్రాంతంగా గుర్తించామని తెలిపారు.  

గ్రామంలో మరి ఎవరికి వ్యాధి  రాకుండా ఉండాలనే సదుద్దేశంతో ముందు జాగ్రత్తగా గ్రామంలో వీధుల వెంట మహా సిమెంట్ వారి ఆధ్వర్యంలో 1% సోడియం హైపో క్లోరైడ్, బ్లీచింగ్ పౌడర్ చల్లించామని ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ, మాస్కులు ధరించి అత్యవసరమైతే బయటకు రావాలని కోరారు.

మేళ్లచెరువు గ్రామం లోని ప్రజలు, ఇతర గ్రామాల వారు బ్యాంకు, ప్రభుత్వ కార్యాలయాలకు ఇతరత్రా పనుల నిమిత్తం వచ్చేవారికి  ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే గ్రామంలోకి అనుమతి ఉంటుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని  సహకరించాలని కోరారు.

Related posts

కుంటాల సోమ‌న్నహ‌రిత‌వ‌నం పార్కుకు మంత్రి అల్లోల శంఖుస్థాప‌న‌

Satyam NEWS

మా వూళ్లో మద్యం వ్యాపారులకు కరోనా రాదు

Satyam NEWS

సద్దుల బతుకమ్మ వేళ బస్తీలలో మురికి కంపు

Satyam NEWS

Leave a Comment