29.7 C
Hyderabad
May 1, 2024 10: 09 AM
Slider తూర్పుగోదావరి

గతేడాదితో పోలిస్తే తగ్గిన నేరాల సంఖ్య

#SPM Ravindra Babu

గత ఏడాది2021తో పోలిస్తే ఈ ఏడాది 2022లో నేరాల సంఖ్య సుమారు ఐదు శాతం తగ్గినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రబాబు తెలిపారు. అలాగే వచ్చే 2023 సంవత్సరంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్య ఇస్తామని ఆ ఏడాదిలో సైబర్ క్రైమ్ బారిన పడి అధిక ప్రమాదాలు గురయ్యే వారి సంఖ్య పెరుగుతుందని ఆయన చెప్పారు. 2022 డిసెంబర్ 31వ తేదీని, 2023 జనవరి 1వ తేదీ నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ప్రమాదాలు లేకుండా నిర్వహించుకోవాలని ఎస్పీ రవీంద్రబాబు ఆకాంక్షించారు. శుక్రవారం కాకినాడ నగరంలో ఉన్న జిల్లా పోలీసు కార్యాలయంలో రవీంద్రబాబు 2022 వార్షిక నివేదికను విలేకరులకు వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు అవగాహన కార్యక్రమాల వల్ల నాటుసారాను ధ్వంసం చేయడం వారిపై కేసులు పెట్టి ఉక్కుపాదం వంటివి మోపడం వల్ల నేరాల సంఖ్య 2021లో కంటే 22లో తగ్గిందన్నారు. 2021లో 8869 కేసులు నమోదు కాగా 2022లో 8481 కేసులు నమోదైనట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు బారిన పడే ప్రదేశాల వద్ద సేఫ్టీ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించి మరణించే వారి సంఖ్య కూడా తగ్గిందన్నారు.

అలాగే ఎస్సీ, ఎస్టీ నేరాలపై 2021తో పోలిస్తే 2022లో కూడా తగ్గాయన్నారు. అయితే మహిళలకు తాము నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా స్వేచ్ఛగా ముందుకు వచ్చి మహిళలు కేసులు పెట్టడం వల్ల అవి కొంచెం ఎక్కువగా నమోదు అయినట్లు చెప్పారు. 2021లో 27 హత్యలు నమోదు కాగా 2022లో 32 హత్య కేసులు నమోదయ్యాయన్నారు.

కోర్టులలో నిలిచిపోయిన కేసులను లోక్ ఆథాలత్ ద్వారా 27 వేల 776 కేసులను పరిష్కరించి ఇరు పక్షాలకు న్యాయం చేసామన్నారు. ఆపరేషన్ పరివర్త కార్యక్రమాలు నిర్వహించి సారా తయారీ వ్యాపారం మానివేసిన 60 కుటుంబాల వారి జీవనం కోసం ప్రభుత్వ పరంగా 41.20 లక్షల రూపాయలు అందించామన్నారు. కేసుల గురించి మాట్లాడుతూ కోడిపందాలు, పేకాట గంజాయి వంటి అమ్మేవారిపైన, నిర్వహించే వారిపై చర్యలు చేపట్టి పీడీ యాక్ట్ను నమోదు చేయడమే కాకుండా వాటి నుండి దూరం చేసేందుకు ఎన్నో అవగాహన కార్యక్రమాలను నిర్వహించామన్నారు.

ప్రతీ సోమవారం తమ జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. వివిధ కేసుల్లో స్వాధీన పరుచుకున్న వివిధ వాహనాలను 17 పర్యాయాలు వేలం వేసి ప్రభుత్వానికి రెండు కోట్ల 10 లక్షల రూపాయలను సమకూర్చామన్నారు. ఇంకా పోలీస్ అవగాహన ద్వారా ప్రజల్లో చైతన్యం నేరాల తగ్గింపునకు కృషి చేస్తున్నట్లు ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ పి శ్రీనివాస్, డిఎస్పీలు ఎం అంబికా ప్రసాద్, పి మురళీకృష్ణా రెడ్డి, ఎస్ మురళీమోహన్, ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

గ్రాండ్ గా “రూమ్” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

Satyam NEWS

హరితహారం మొక్కలు అగ్నికి ఆహుతి…!

Satyam NEWS

అమ్మా….నిన్ను కష్టపెట్టిన ఈ ‘బంగారు తెలంగాణ’ను క్షమించు తల్లీ….

Satyam NEWS

Leave a Comment