38.2 C
Hyderabad
April 29, 2024 21: 59 PM
Slider వరంగల్

అధిక వర్షాల  పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి

#krishna aditya IAS

రాష్ట్ర వ్యాప్తంగా  గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ములుగు  జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సంబంధిత అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజల సురక్షితంగా ఉండేలా ఆయా మండల తహశీల్దార్స్, స్పెషల్ ఆఫీసర్స్ తక్షణ సహాయం క చర్యల నిమిత్తం అలెర్ట్ గా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

గోదావరి నదీవరద ఉదృతిని బట్టి  యుద్ద ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, గోదావరి  పరీవాహక ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.

వాగులు వంకలన్నీ ఉద్రుతంగా ప్రవహిస్తున్ననేపథ్యంలో మత్యకారులు చేపల వేటకు వెళ్లరాదని, అత్యవసరం అయితే తప్ప ఇంట్లోనుండి బయటకు రాకుడదని  జిల్లా కలెక్టర్ ప్రజలకు పిలుపు నిచ్చారు.   

లోతట్టు ప్రాంతాలలో నీటి ప్రవాహాలు ఉన్నచోట ప్రయాణాలు చేయకుండా బ్యారేకేడ్లు ఏర్పాటు, సూచిక బార్డులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు తగు సూచనలు ఇచ్చారు.

జిల్లా  అధికారులు భారీ వర్షాల నేపథ్యంలో  హెడ్ క్వార్టర్ లో ఉండి సమన్వయంతో పనులు చేయాలనీ ,  గ్రామలోని లోతట్టు వంతెనల వద్ద నీటి ప్రవాహం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నీటి ప్రవహం అధికమైనట్లయితే దారులను మూసివేసి బారికేడ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. విద్యుత్  పునరుద్దరణ చర్యలు వేగవంతంగా చేపట్టాలని,  విద్యుత్ వైర్లు తెగి పడిపోయినట్లయితే వెంటనే మరమత్తులు చేయాలని ఆదేశించారు.

జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో  ఎలాంటి ప్రాణ, ఆస్థి మరియు జంతు నష్టం వాటిలకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని, రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికాలను  ఆదేశించారు.

టెలి కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, డి ఆర్ ఓ రమాదేవి సంబంధిత తహసిల్దార్లు,  జిల్లా పంచాయతి అధికారి, స్పెషల్ ఆఫీసర్స్,  తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఒంటిమిట్ట సీత రామ లక్ష్మణ స్వామి వారికి చక్రస్నానం

Satyam NEWS

మాస్ యాక్షన్ ప్రియుల కోసం ‘రణస్థలి’

Satyam NEWS

మాజీ ప్రధాని పి.వి. పై కవితలకు ఆహ్వానం

Satyam NEWS

Leave a Comment