Slider ఆంధ్రప్రదేశ్

ట్రాజెడీ: రాజధాని కోసం ఆగిన మరో గుండె

amaravathi

అమరావతి రాజధానిగా ఉండాలనే డిమాండ్ తో ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో మనస్థాపంతో రాలుతున్న గుండెలు ఎక్కువవుతున్నాయి. రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందని మనస్థాపం చెందిన ఒక వృద్ధురాలు మరణించింది. గుంటూరు జిల్లాలోని నేలపాడులో ఇందుర్తి సుబ్బమ్మ అనే వృద్ధురాలు గత కొద్ది రోజులుగా రాజధాని పై ఆవేదన చెందుతున్నది.

మూడు రాజధానుల నిర్ణయంతో తీవ్ర మనోవేదనకు గురైన సుబ్బమ్మ శుక్రవారం గుండెపోటుతో మృతి చెందింది. రాజధాని కోసం ఇప్పటి వరకు దాదాపు 10 మంది రైతులు, రైతు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రాజధానిగా అమరావతినే కొనసాగాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమం 31వ రోజుకు చేరింది. మూడు రాజధానులు వద్దు అంటూ రైతులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.

Related posts

రాజు వయ్యా మహరాజు వయ్యా…..

Satyam NEWS

చెత్తపలుకు: అమరావతి-అసత్యాలు-ఎల్లోమీడియా

Satyam NEWS

ప్రతీ సోమవారం చేనేత ధరించండి: కేటీఆర్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!