38.2 C
Hyderabad
April 29, 2024 21: 51 PM
Slider వరంగల్

రెడ్ లైట్: ఒకే బాలిక రెండు సార్లు కిడ్నాప్

kidnap

వరంగల్ జిల్లా, కాజీపేటకు చెందిన ఒక బాలిక రెండోసారి కిడ్నాప్ కు గురి అయింది. గతంలో ఒక సారి కొందరు యువకులు బాలికను కిడ్నాప్ చేయగా, పోలీసులు ఆమెను గుర్తించి విడిపించారు. నిందితులను అరెస్ట్ చేయగా, వారికి బెయిల్ మంజూరైంది.

ఈ కేసు కోర్టులో నడుస్తుండగానే ఆమె మరోసారి కిడ్నాప్ కు గురికావడంతో పోలీసులు సరైన భద్రతా చర్యలు కల్పించలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నదని      అన్న ప్రశ్నకు సమాధానంగా తన కుమార్తెను కిడ్నాప్ చేసిన వారు రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తామని బెదిరిస్తున్నారని ఆమె తండ్రి పోలీసులకు చెప్పాడు.

గతంలో కిడ్నాప్ చేసిన వారే ఈ దఫా కూడా ఈ పని చేసి ఉండవచ్చని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. కిడ్నాపర్లతో, తన కుమార్తెతో మాట్లాడిన ఆడియోను పోలీసులకు అందించగా, కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Related posts

ఎవరైనా నా పేరు చెబితే క్రిమినల్ కేసు పెట్టండి

Satyam NEWS

దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతూ భావితరాలకు బంగారు బాట

Satyam NEWS

మహిళా శ్రేయస్సే లక్ష్యంగా కొత్త పథకం

Murali Krishna

Leave a Comment