31.7 C
Hyderabad
May 2, 2024 10: 20 AM
Slider కరీంనగర్

బీసీ కుటుంబాలకు లక్ష ఆర్థిక సహాయం

#nagarkurnool

బీసీ కులవృత్తుల కుటుంబాలకు లక్ష ఆర్థిక సహాయం అందించనున్నట్లు గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం  కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం నుండి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు బీసీ సంక్షేమ శాఖ అధికారులతో బీసీ చేతి వృత్తులదారులకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం లక్ష రూపాయల చెక్కుల పంపిణీ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 15 నుండి ప్రతి నియోజకవర్గానికి 300 బీసీ కులవృత్తుల కుటుంబానికి లక్ష ఆర్థిక సహాయం ఇవ్వాలని పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగాలని ప్రతి లబ్ధిదారుడికి అందించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బిసి కుల వృత్తుల వారికి కుటుంబానికి రూ.లక్ష చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థికసాయం కార్యక్రమం ఓ నిరంతర ప్రక్రియ అని, ప్రతి లబ్ధిదారులకి అందించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

బిసి కులవృత్తులు నిర్వహించుకునే చేతివృత్తిదారులకు ప్రభుత్వ నుంచి  పథకం ఓ నిరంతర ప్రక్రియని అని, రాష్ట్రంలోని ప్రతి  విశ్వబ్రహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి వంటి కులవృత్తులు, చేతివృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న వారికి లక్ష ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. ఏ ఒక్క లబ్ధిదారుడు  కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి ప్రతి మాసం కొంతమంది లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కును అందిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా జూలై 9న మంచిర్యాలలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించామని  తెలిపారు.

అదే రోజు అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంఎల్‌ఎలచే లబ్దిదారులకు రూ. లక్షను పంపిణీ చేశామని గుర్తు చేశారు.అదేవిధంగా మొదటి విడతకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 300 మంది చొప్పున నమోదు చేసుకున్న  చేతి కులవృత్తిదారులు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి జిల్లా ఇన్చార్జ్ మంత్రుల ఆమోదంతో ఆయన నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ఈ నెల 15వ తేదీ నుండి ఈనెల 25వ తేదీ లోగా పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు.

జిల్లా యంత్రాంగం పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేసిన మంత్రి ఆమోదంతో ఎమ్మెల్యేల ద్వారా లబ్ధిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీకి కావలసిన నిధులను కలెక్టర్ ఖాతాలోకి జమ చేస్తామని తెలిపారు. చేతివృత్తిదారుల జీవితాలలో వెలుగులు నింపి, వారికి ఆర్థిక భరోసాను అందించడం, గౌరవప్రదమైన జీవనం కొనసాగించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరం తపన పడుతుంటారని మంత్రి చెప్పారు.

ఈ పథకం ద్వారా వారి జీవితాల్లో ఆర్థిక స్వావలంబనకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. లబ్ధిదారులు వృత్తి పనిముట్లు, ముడిసరుకు కొనడానికి ఈ నిధులు ఉపయోగపడుతాయని, దీని ద్వారా లబ్ధ్దిదారులు ఆర్థిక స్వావలంబన సాధించడంలో అధికార యంత్రాంగం నిరంతరం తోడ్పాటు అందించాలని ఆయన సూచించారు. హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ

ఈ మాసానికి సంబంధించిన నియోజకవర్గానికి 300 మంది లబ్ధిదారులకు ఈ మాసంలోనే అందించాలని రానున్న ప్రతి మాసంలో కొంతమంది లబ్ధిదారులకు అందించి ప్రతి లబ్ధిదారులకి అందే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన అన్నారు.

ఆన్లైన్లో నమోదు చేసుకున్న ప్రతి దరఖాస్తులను ఎంపీడీవోల ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియను ఈనెల 18 లోగా పూర్తి చేయాలని  ఆదేశించారు. జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా నుండి ఆన్లైన్లో నమోదు చేసుకున్న 20670 మంది దరఖాస్తులు చేసుకోగా 11004  దరఖాస్తులను లబ్ధిదారులుగా ఎంపిక చేశామని,720 దరఖాస్తులు పథకానికి అనర్హులుగా గుర్తించమని 8946 దరఖాస్తులను ఈనెల 18 లోగా వెరిఫికేషన్ చేసి పూర్తి చేస్తామన్నారు.

అర్హులుగా ఎంపికైన జాబితా నుండి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలోని 1200 మంది లబ్ధిదారులకు ఈనెల 15వ తేదీ నుండి లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలో  సమర్థవంతంగా నిర్వర్తిస్తామని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శ్రీధర్ జి, కల్వకుర్తి ఆర్డిఓ రాజేష్ కుమార్, సెక్షన్ ఇంచార్జ్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రకాశం జిల్లా సమస్యలపై ప్రధాని సానుకూల స్పందన

Satyam NEWS

అభ్య‌ర్థుల‌ను మార్చ‌క‌పోవ‌డ‌మే కారు బోల్తాకు కార‌ణం?!

Sub Editor

దేశాన్ని కుదిపేస్తున్న PFI ఉగ్రవాద కార్యకలాపాలు

Satyam NEWS

Leave a Comment