31.7 C
Hyderabad
May 2, 2024 08: 20 AM
Slider మహబూబ్ నగర్

ఇన్స్పైర్ అవార్డ్స్  ఆన్లైన్ నామినేషన్ పై సైన్సు ఉపాధ్యాయులకు అవగాహన

#inspire

ఇన్స్పైర్ అవార్డ్స్  ఆన్లైన్ నామినేషన్ పై సైన్సు ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్నట్లు కృష్ణారెడ్డి తెలిపారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటల నుండి లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ నాగర్ కర్నూల్ జిల్లాతో పాటు తాలూకాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, రెసిడెన్షియల్, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న సైన్స్  గణిత ఉపాధ్యాయులకు ఇన్స్పైర్ అవార్డ్స్ నామినేషన్స్ ఆన్లైన్లో నమోదుపై  అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇన్నోవేషన్ అనేది పాఠశాల స్థాయి నుంచి అలవాటు పడాలని ఇన్నోవేషన్ జీవితంలో ఒక భాగం కావాలని వారికి ఎదురయ్యే సమస్యల నుంచి ఇన్నోవేషన్ పడుతుందని విద్యార్థుల్లో శాస్త్రీయతను వెలికి తీసి వారికి ఐడియా కాంపిటీషన్ పెట్టి వినూత్నమైనటువంటి ఐడియాలను ఇన్స్పైర్ మనకు యాప్ లో నమోదు చేయాలని అన్నారు. 

ఇన్స్పైర్ నామినేషన్ల చివరి తేదీ ఆగస్టు 31వ తేదీ అయినప్పటికీ జులై 31వ తేదీ లోపు విద్యార్థులు నామినేషన్లు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు.  ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల నుండి ఐదు నామినేషన్లు తప్పక పూర్తి చేయాలని అన్నారు ఎంపికైన విద్యార్థుల అకౌంట్లో పదివేల రూపాయలు నగదు పడతాయని అన్నారు. ఇన్స్పైర్ నమోదు కార్యక్రమంలో మరిన్ని మెలకువల కొరకు రేపు మధ్యాహ్నం రెండు గంటల నుండి ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఆన్లైన్లో సమావేశం ఉంటుందని సూచించారు.ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న సైన్స్  గణిత ఉపాధ్యాయులు విధిగా పాల్గొనాలని అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ షర్పద్దిన్  తెలిపారు. ఈ కార్యక్రమంలో గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు తిరుపతయ్య మరియు సైన్స్ గణిత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జిల్లా కలెక్టర్లతో సిఎస్ వీడియో సమావేశం

Bhavani

టిఎన్జీవోల రాష్ట్ర కార్యదర్శికి డిప్యూటీ స్పీకర్ అభినందన

Satyam NEWS

దళిత ద్రోహి కేసీఆర్… మాయ మాటలకు మోసపోకండి..!

Satyam NEWS

Leave a Comment