ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం పుణ్యక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పర్వదినం కావడంతో శ్రీశైలం నేడు భక్తులతో పోటెత్తింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు రాత్రి పార్వతీ మల్లికార్జున స్వామివారికి బ్రహ్మోత్సవ కళ్యాణం చేయనున్నారు. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు నందివాహనసేవలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సాయంత్రం ఆలయ పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించనున్నారు.
previous post