32.2 C
Hyderabad
May 12, 2024 19: 38 PM
Slider తూర్పుగోదావరి

కె.పి.ఆర్. తో మీరు కుమ్మకైయ్యారా ? నేను కుమ్మకైయానా?

#nallamilli

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ నేతలకు తగిన సమాధానం ఇచ్చారు. పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ

1.నిన్నటి రోజున గ్రాసిం ఇండస్ట్రీస్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. నేను సాంకేతికపరమైన అంశాలు మాత్రమే మాట్లాడటం జరిగింది దాదాపు 10 -15 నిమిషాల పాటు నా అభిప్రాయం చెప్పడం జరిగింది.దానిలో రాజకీయ పరమైన అంశాలు ఏమి లేవనేత్త లేదు. వాళ్ళు గోదావరి నీరు గాని, భూగర్భ జలాలను గానీ వాడుకుంటే రైతులు ఏ విధంగా ఇబ్బందిపడతారు, రాబోయే ఇబ్బందులు ఎంత ప్రమాదకరమైనవి, తరవాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాలు మాత్రమే  నేను మాట్లాడటం జరిగింది. మరి తరువాత శాసనసభ్యులు వారు మాట్లాడుతూ నన్ను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని అసందర్భమైన విషయాలు మాట్లాడటం జరిగింది.ఆ వేదిక మీద ఏమి మాట్లాడాలి అనే అవగాహన లేని వ్యక్తి అత్యున్నత చదువు చదవడం దురదృష్టకరం, పైగా ఇప్పుడు ప్రజాప్రతినిధి కావడం ఇంకా దురదృష్టకరం.

2.ఇది తెలుగుదేశం హయాంలో ఇచ్చారు 2018లో ఇచ్చారని మాట్లాడారు. మరి ఈవేళ గ్రాసిం ఇండస్ట్రీస్ వారు స్వయంగా ప్రకటించిన నివేదిక ఇది. ఈ నివేదిక ప్రకారoగా 2013లో ఎన్విరాన్మెంట్ కాన్సెంట్ ఆర్డర్ ఇచ్చారు అంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్నారు. ఆ తరువాత 2018 లో కాన్సెంట్ ఆర్డర్ బదిలీ చేశారు అంటే వారి ఇచ్చిన కాన్సెంట్ ఆర్డర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చేశారు అంటే కె. పి. ఆర్ కి సంబంధించి ఆస్తులను గ్రాసిం కు బాదలయించారు. ఆ తరువాత 2019లో కాన్సెంట్ ఆర్డర్ పొడిగించారు, మరల 2020 లో కాన్సెంట్ ఆర్డర్ పొడిగించారు అంటే 2019, 2020లో ఉంది ఎవరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి 2018లో జగన్మోహన్ రెడ్డి గారు గొల్లల మామిడాడ లో బహిరంగ సభలో మాట్లాడుతూ కె. పి. ఆర్. అనుమతులు రద్దు చేస్తాను అని స్పష్టంగా చెప్పారు.ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు అని సూర్యనారాయణ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం.

3.అదే విధంగా ఆ రోజు సముద్ర తీర ప్రాంతానికి తరలించుకోవాలని యాజమాన్యానికి సూచించారు మరి దానిని ఎందుకు పాటించలేదు. జనావాసాల మధ్యే ఎందుకు కొనసాగిస్తున్నారు దానికి సూర్యనారాయణ రెడ్డి గారు ఎందుకు మద్దతు ప్రకటిస్తున్నారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి నిన్నటి రోజున మీరు గానీ, మీ అనుయాయులు గానీ గ్రాసిం ఇండస్ట్రీస్ కి ఎంత మద్దతు పలికారో తెలుస్తా ఉంది ప్రజానీకానికి.

4.ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వంమే అనుమతులు ఇచ్చి ఉంటే మరి అమరావతి నిర్మాణం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేపడితే దానిని మీ ప్రభుత్వం అర్ధంతరంగ నిలుపుదల చేయలేదా? ఇవాల్టికి అమరావతిని మార్పు చేస్తామని మాట్లాడడం లేదా? మరి అటువంటిది ఏ నిర్మాణం తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలుకాని గ్రాసిం ఇండస్ట్రీస్ ను ఎందుకు నిలుపుదల చేయలేదు మీరు?.

5.అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో 72% నిర్మాణం పూర్తి అయితే ఆ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిలుపుదల చేయలేదా? ఈవేళ వైద్య శాస్త్రం పోస్ట్ గ్రాడ్యుయేట్ మీరు. నిన్న మీరు మాట్లాడుతూ పొల్యూషన్ ఉంటే నేనే ముందు అడ్డుకుంటానని మాట్లాడారు, నేను నిన్న మాట్లాడింది ఏ ఉత్పత్తి వలన ఏ హాని కలుగుతోందో స్పష్టంగా చెప్పాను. అందులో క్లోరోప్లోరో కార్బన్స్ వలన ఏ విధమైన ఇబ్బంది కలుగుతుందో స్పష్టంగా చెబితే మీరు ఏదైన పొల్యూషన్ కి సంబందించి ఇబ్బంది కలిగే మేమే పోరాటం చేస్తామని మాట్లాడారు అది మీ అమాయకత్వం అనాలా? మీ నటన అనాలా ? అర్ధం కానీ పరిస్థితి.

6.ఆ విధంగా అక్కడ ఉత్పత్తి అయ్యో ప్రతి ప్రోడక్ట్ పైన వాతావరణం ఏ విధంగా పొల్యూట్ అవుతుందో నేను చెప్పడం కాదు నిన్నటిరోజు కొన్ని ఇంగ్లీష్ పత్రికలు సైంటిస్ట్ ల అభిప్రాయాలు తీసుకుని ప్రచురించడం జరిగాయి. కొన్ని ఉత్పత్తుల వలన కాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల భారీన పడటం జరుగుతుందని ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ లు  సూచించారు. అది తెలుసుకోకుండా మాట్లాడటం జరిగింది. నిన్న విలేకరులు ఇంత పెద్ద మొత్తం లో గోదావరి నీరు కానీ, భూగర్భ జలాలు వినియోగిస్తే రేపు సాగునీటి సమస్యను ఏ విధంగా తీరుస్తారు అని అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేక ప్రభుత్వం చెబుతుంది అని సమాధానం దాట వేశారు.రేపు రైతుల పరిస్థితి ఏంటి? రేపు సాగునీరుకి ఇబ్బంది వస్తే ఏ విధంగా తీరుస్తారు.రేపు ప్రజల ఇబ్బందిని తీర్చవలసిన బాధ్యత మీపై ఉంది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది.

7.కె.పి.ఆర్ ఇండస్ట్రీస్ తో నేను కుమ్మకైయానని అందువల్ల నాపై కేసులు లేవని మీరు మాట్లాడారు. కె.పి.ఆర్ ఇండస్ట్రీస్ పై ఉద్యమం మొదలైన రోజు తెలుగుదేశం పార్టీ ఆ ఉద్యమం లో లేదు. మీకు చరిత్ర  తెలీదు మీకు. కె.పి.ఆర్ ఇండస్ట్రీస్ ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన రోజు కొంతమంది దొంతమూరు గ్రామస్థులు గాయపడటం, పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని మీడియా ద్వారా విషయం తెలుసుకుని, తక్షణం భాదితులకు అండగా ఉండండి, గ్రామస్థులకు అండగా ఉండండని వారు ఆదేశించిన తరువాతే మేము ఉద్యమం లోకి రావడం జరిగింది. ఈ కేసులు అన్ని కూడా అభిప్రాయ సేకరణ చేసిన రోజున జరిగిన విషయాలపైన మాత్రమే నమోదు అయ్యాయి అన్న విషయం మీరు గ్రహించాలి.అందువల్ల ఆ కార్యక్రమంలో నేను లేను కనుక నాపై కేసులు లేవు.

8.నేను కేసులకు భయపడే వాడినే అయితే ఈ ప్రభుత్వం లో మీ వల్ల 27 కేసులు ఎదుర్కొనే పరిస్థితి ఉండదని ఈ సందర్బంగా స్పష్టం చేస్తున్నా.ఇక మరొకటి కె. పి. ఆర్. వాళ్లు నాకు ఆర్ధిక సహాయo చేశారని మీరు మాట్లాడారు మరి కె.పి. ఆర్. వాళ్లు చంద్రబాబు గారి పాదయాత్ర కు ఆర్ధిక సహాయo చేస్తే బలభద్రపురంలో కె.పి.ఆర్.కు వ్యతిరేకంగా కె.పి.ఆర్. బాధితులను ఉద్దేశించి చంద్రబాబు ఎందుకు మాట్లాడతారు. కె.పి.ఆర్. బాధితులను అండగా ఉంటామని చంద్రబాబు గారు ఎందుకు ప్రకటించారు. ఆర్ధిక సహాయం చేస్తే కె. పి ఆర్. విషయమే మాట్లాడరు కదా ? చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర కు సంబంధించి బలభద్రపురంలో జరిగిన సభ కె.పి.ఆర్. కు వ్యతిరేకంగానే జరిగింది.కె.పి.ఆర్. వాళ్ళు ఆర్ధిక సహాయం చేస్తే కె.పి.ఆర్. కు వ్యతిరేకంగా సభ జరుగుతుందా? అది స్పష్టం చేయండి సూర్యనారాయణరెడ్డి గారు.

9.ఇక నేను కె.పి.ఆర్.తో కుమ్మకైతే 2014 ఎన్నికలలో  కె.పి.ఆర్. వాళ్ళు మీకు 5 కోట్ల రూపాయలు ఆర్ధిక సాయం చేసి కొమరిపాలెంలో మీ విజయం కోసం వాళ్ళు ఎందుకు కృషి చేశారు. అదే విధంగా 2019 ఎన్నికల్లో మీకు ఆర్ధిక సహాయo చేసి, మీ విజయానికి కె. పి. ఆర్. వాళ్ళు ఎందుకు కృషి  చేశారు .నేను వాళ్ళతో కుమ్మకైతే కె. పి. ఆర్. వాళ్ళు నాకు అనుకూలంగా పని చేయాలి కానీ మీకు అనుకూలంగా ఎందుకు పని చేశారు? నిన్న స్పష్టంగా కె.పి.ఆర్. సంస్థ మాజీ డైరెక్టర్ మాట్లాడటం జరిగింది 2014 నుండి ఈ రోజు వరకు మీరు ఒకటే స్టాండ్ లో ఉన్నారు కె. పి. ఆర్ కు అనుకూలంగానే ఉన్నారని మాట్లాడారు. అనుకూలంగా ఉన్న వ్యక్తులు కుమ్మకైనట్టా? వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు కుమ్మకైనట్టా? ఆ విషయాన్ని కూడా మీరు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. నేను 2013లో చంద్రబాబు నాయుడు గారి ఆదేశములతో నేను కె.పి.ఆర్. కు వ్యతిరేకంగా పని చేశాను ఈ రోజు గ్రాసిం కు వ్యతిరేకంగానే పని చేస్తున్నాను.వారి నుండి ముడుపులు తీసుకుని ప్రజాదరణను, ప్రజల భద్రతను, ప్రజల ఆరోగ్యాన్ని పక్కన పెట్టి గ్రాసిం కు మద్దుతూ తెలుపుతున్నారని ఈ సందర్బంగా తెలియచేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

Related posts

శ్రీ పర్వత వర్థిని దేవీ సమేత శ్రీ శాంతి లింగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

కొల్లాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో కరోనా క్యాంప్

Satyam NEWS

గాంధీభవన్లో  బతుకమ్మ సంబరాలు

Satyam NEWS

Leave a Comment