29.7 C
Hyderabad
May 3, 2024 03: 24 AM
Slider ముఖ్యంశాలు

ఆగష్టు 25న ప్రార్ధన స్థలాల ప్రారంభం

#Telangana State Government

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయంలోని ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవ తేదీలు ఖరారు అయ్యాయి. ఆగస్ట్ 25వ తేదీన సచివాలయంలోని దేవస్థానం, మసీదు, చర్చి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సెక్రటేరియట్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

ఈ రివ్యూ మీటింగ్‌లో సచివాలయంలోని మూడు ప్రార్థనా మందిరాలను ఒకేరోజు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మూడు మతాల పెద్దలను సంప్రదించి ఆగస్ట్ 25వ తేదీని సీఎం కేసీఆర్ ఫిక్స్ చేశారు.

ఆయా మతాల సంప్రదాయం ప్రకారం ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు. పోచమ్మ తల్లి విగ్రహం ప్రతిష్టాపన చేసి.. దేవాలయాన్ని పునః ప్రారభించనున్నట్లు సమాచారం.

Related posts

మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ

Satyam NEWS

న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతుంది

Satyam NEWS

రాజౌరి ఆర్మీ క్యాంపుపై ఉగ్ర దాడి: ముగ్గురు జవాన్ల వీర మరణం

Satyam NEWS

Leave a Comment