31.2 C
Hyderabad
May 3, 2024 02: 41 AM
Slider నల్గొండ

ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం లారీలను రానివ్వద్దు

#checkpost

ఇతర రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు,కర్ణాటక,మహారాష్ట్ర నుండి ధాన్యం లారీలను తెలంగాణ లోకి రానివ్వద్దని తహశీల్దార్ సాయ గౌడ్ అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలంలోని మట్టపల్లి కృష్ణానది వద్ద ఉన్న అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ను బుధవారం తహసిల్దార్ పరిశీలించారు.ఇతర రాష్టలనుంచి ధాన్యం తక్కువ ధరలకు కొనుగోలు చేసి తెలంగాణలో ఎక్కువ ధరలకు వ్యాపారులు విక్రయిస్తున్నారని,దాని వలన తెలంగాణలో రైతులు నష్టపోతున్నారని అన్నారు.తెలంగాణలో పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొంటుందని ఆయన అన్నారు.చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి అక్రమాలు జరగవద్దని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమణారావు,వి ఆర్ ఓ లు,ఎస్సై రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

మళ్ళీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు

Sub Editor 2

అధికారిక సమావేశానికి అధికారుల గైర్హాజరు

Satyam NEWS

మున్సిప‌ల్ ఎన్నికల వేళ విజ‌య‌న‌గ‌రంలో‌ ప్లాగ్ మార్చ్

Satyam NEWS

Leave a Comment