28.7 C
Hyderabad
April 26, 2024 10: 57 AM
Slider నిజామాబాద్

అధికారిక సమావేశానికి అధికారుల గైర్హాజరు

#bichkunda

కామారెడ్డి జిల్లా బిచ్కుందలో సర్వసభ్య సమావేశం బిచ్కుంద మండల కేంద్రం లోని ఎంపీడీవో సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అశోక్ పటేల్ అధ్యక్షతన  బుధవారం జరిగింది. ఈ సందర్బంగా పలు శాఖల అధికారులు గైర్హాజరు కావడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

ముందుగా వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి పోచయ్య సభ్యులు అడిగిన పలు సందేహాలకు సమాధానం ఇచ్చారు. అనంతరం సహకార సంఘం అధ్యక్షులు జింకలు పంట చేలలో విత్తనాలు నష్టపరుస్తున్నాయని రైతులు వాపోతున్నారని సభ దృష్టికి తీసుకురాగా ఆ విషయంపై కలెక్టర్ కి నివేదిక పంపిస్తామన్నారు. విద్యుత్ శాఖలో అభివృద్ధి పనులు కావడం లేదు గతంలో కంటే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విద్యుత్ ఏఈ వివరించారు.

వైద్య ఆరోగ్యశాఖ తరపున వైద్యురాలు మమత మాట్లాడుతూ  సీజనల్ వ్యాధులు వ్యాపించే వర్షాకాలంలో  నీటి నిల్వ లేకుండా వారంవారం డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి నీటి నీలువ లేకుండా చూడాలన్నారు. అందుకు సర్పంచ్ లు తమ గ్రామాల్లో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నీటితొట్టిలను శుభ్రపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

విద్యాశాఖ అధికారి రాములు నాయక్  మాట్లాడుతూ మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా  ఎంపిక చేయబడిన పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేసి విద్యార్థులకు ఆంగ్ల విద్యను ఈ సంవత్సరం నుండే ప్రారంభిస్తున్నామన్నారు. బడి బయట పిల్లలను ఈ నెల చివరి వరకు గుర్తించి పాఠశాలలో చేరే విధంగా కృషి చేస్తామన్నారు.

మిషన్ భగీరథ నీటి పైపు లైన్లు  లీకేజీ వల్ల నీరు కలుషితం అవుతున్నాయని,నీరు కూడా సక్రమంగా సరఫరా కావడం లేదంటూ   సభ్యులు సభ దృష్టికి తీసుకురాగా నీటి సరఫరాలో జాప్యం లేకుండా చూస్తామని పైప్లైన్ల లీకేజీని గుర్తించిన వెంటనే మరమ్మత్తులు పనులు చేస్తున్నామని వర్షాకాలం దృష్ట్యా నీరు కలుషితం కాకుండా చూస్తామని వాటర్గ్రిడ్ ఎఈ హరీష్,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాచప్పలు తెలిపారు.

అనంతరం పశు సంవర్ధక, అటవీ, ఉపాధి హామీ,సాంఘిక సంక్షేమ,నీటిపారుదల, పంచాయతీరాజ్, రెవెన్యూ,తదితర శాఖలతో ఎంపీపీ సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ తో పాటు జెడ్పీటీసీ భారతి రాజు, మార్కెట్ కమిటి అధ్యక్షులు మల్లికార్జున్,  సొసైటీ చైర్మన్ బాలాజీ (బాలు), వైస్ ఎంపీపీ రాజు పటేల్ , రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బసవరాజు పటేల్,  ఎంపీడీవో ఆనంద్,ఇన్చార్జ్   తహసీల్దార్ సంగమేశ్వర్,కోఆప్షన్ సభ్యులుగా జావేద్ సిద్ధిఖీ  తో పాటు ఆయా విభాగాల అధికారులు, గ్రామాల సర్పంచ్లు,ఎంపిటిసిలు ఉన్నారు.

జి. లాలయ్య, సత్యం న్యూస్, జుక్కల్ నియోజకవర్గం

Related posts

ఇస్ ఇట్ రైట్:నిర్భయ దోషులను శిక్ష నుంచి తప్పిస్తారా

Satyam NEWS

రాష్ట్ర రాజకీయాలలో ఉద్యమ నేత జూపల్లి కీలకం కాబోతున్నారా?

Satyam NEWS

ప్రత్యామ్నాయం పరిశీలించాలి

Sub Editor 2

Leave a Comment